జియో నుంచి డ్యూయల్ సిమ్ ఫోన్ !

By: Madhavi Lagishetty

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ ప్రభంజనాన్ని స్రుష్టించింది. 4జి ఫోన్ తో ఫ్రీ ఇంటర్నెట్ కాల్స్ అందిస్తూ...టెలికాం మార్కెట్లో జియో సంచలనానికి తెరలేపింది. ఇది మరవకముందే...4జి ఫీచర్ ఫోన్ ప్రకటనతో టెలికాం సంస్థలన్నీ వణికిపోతున్నాయి. జియో వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 4జి జియో ఫోన్ ఆగస్టు 24 నుంచి ఫస్ట్ కం ఫస్ట్ బెసిస్ ద్వారా ప్రీ బుకింగ్ ప్రారంభం కానున్నట్లు రిలయన్స్ సంస్థ ప్రకటించింది.

జియో నుంచి డ్యూయల్ సిమ్ ఫోన్ !

అయితే జియో 4 జి ఫోన్ మైక్రోమ్యాక్స్ ...ఇంటెక్స్ తో జతకట్టి జియో ఫోన్లను తయారు చేస్తునట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

4జి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉన్న జియో ఫోన్ కావాలనుకునే వినియోగదారులు ఫోన్ కోసం ప్రీ బుకింగ్ చేసేటప్పుడు రూ. 1500 సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ 1500రూపాయలు 36 నెలల్లో తిరిగి చెల్లిస్తారు. మొదట్లో జియో ఫోన్ సింగిల్ సిమ్ తో విడుదల కానుందని ప్రకటించినప్పటికీ...కొన్ని నెలల్లోనే డ్యూయల్ సిమ్ ఫీచర్ తో జియో ఫోన్ మార్కెట్లోకి విడుదల కానుందని అనధికార వర్గాల సమాచారం.

జియో 4జి డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోనను అక్టోబర్ నెలలో లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 4జి ఫోన్ లో ఫస్ట్ సిమ్ స్లాట్ లో కేవలం జియో 4జి సిమ్ మాత్రమే పనిచేస్తుంది. ఇక సెకండ్ స్లాట్ లో ఏనెట్ వర్క్ కు చెందిన 2జి సిమ్ అయిన సపోర్ట్ చేయనుంది.

జియో 4జి ఫీచర్ ఫోన్ లో వై-ఫై హాట్ స్పాట్ సౌకర్యం లేదు. దీంతో ఈ ఫోన్ లోని ఇంటర్నెట్ ను ఇతర డివైస్ లకు షేర్ చేసుకోలేము. ఇక 309 ప్లాన్ కచ్చితంగా తీసుకుంటే టీవి-కేబుల్ ను వాడుకునేందుకు వీలుంటుందని రిలయన్స్ సంస్థ తెలిపింది.English summary
Reliance is likely to launch the dual SIM variant of the JioPhone sometime in October this year.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting