‘మేడ్ ఇన్ ఇండియా’గా మారనున్న రిలయన్స్ జియోఫోన్!

By: Madhavi Lagishetty

రిలయన్స్ జియోఫోన్...దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ ఏడాది రిలీజ్ చేసిన చాలా హైప్ మొబైల్స్ ఫోన్లలో జియోఫోన్ ఒకటి. మొబైల్ ఇండస్ట్రిలో అత్యధిక రిస్పాన్స్ పొందింది. ఈ స్మార్ట్ ఫీచర్ ఫోన్ కోసం కొనుగోలుదారులు ఏ స్థాయిలో పోటీ పడ్డారనేది...ఈ ఫోన్ కు ఉన్న డిమాండ్ తో స్పష్టంగా కనిపించింది.

‘మేడ్ ఇన్ ఇండియా’గా మారనున్న రిలయన్స్ జియోఫోన్!

ఈ మధ్యకాలంలో జియోఫోన్ సంచలనం క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ డివైస్ మేడ్ ఇన్ ఇండియాగా మారనుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ముకేష్ అంబానీ నేత్రుత్వం వహిస్తున్నారని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. చైనీస్ విక్రయదారుల సదుపాయంలో సరఫరాకు సంబంధించిన సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.

చైనా యూనిట్లో 6 మిలియన్ యూనిట్లు కలిగిన మొదటి బ్యాచ్ జియో ఫోన్ ఒక్కటే. రెండవ బ్యాచ్లో, 10మిలియన్ల యూనిట్లు రవాణా చేయాలని సంస్థ హామీ ఇచ్చింది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో..ఈ డివైస్ తయారీ చెన్నైతో కూడా ప్రారంభమయ్యింది. డిసెంబర్ 2018నాటికి జియో 200మిలియన్ యూనిట్ల విక్రయాలను సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని రిపోర్ట్ పేర్కొంది.

సెల్‌కాన్ 4జీ స్మార్ట్ ఫోన్ , ధర రూ. 4,199 మాత్రమే

జియోఫోన్ను రిలీజ్ చేసిన సమయంలో...ముఖేశ్ అంబానీ దేశంలో ప్రతివారంలో 5 మిలియన్ల జియో ఫోన్లను విడుదల చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఏడాది చివరినాటికి భారత మార్కెట్లో ఫీచర్ ఫోన్ ప్రొడక్ట్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇప్పుడే రియాలిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది.

జూలైలో డివైస్ రిలీజ్ చేసినప్పటికీ...అప్పటి నుంచి జియోఫోన్ను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి...వారు పెట్టుకున్న టార్గెట్ చేరుకోవటానికి విఫలం అవుతూనే ఉంది.

అయితే సంస్థ ఇప్పుడు తన ప్లాన్ను మార్చాలని నిర్ణయించుకుంది. తక్కువ ధరతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కు మార్చడానికి కంపెనీ జియోఫఓన్ ప్రొడక్ట్ ఆపడానికి ప్లాన్ వేసింది. అలాగే జియోఫోన్ ఈమధ్యే ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటి సపోర్టుతో గూగుల్ అసిస్టెంట్ను ప్రారంభించింది.

English summary
Reliance JioPhone is likely to be made in India soon as there are glitches at the Chinese facility.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot