రూ. 49 చెల్లించండి, 28 రోజులు ఎంజాయ్ చేయండి

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో యూజర్ల కోసం మరో ఆఫర్ తీసుకొచ్చింది. అయితే ఇది జియో యూజర్లకు మాత్రమే కాకుండా అందరికీ వర్తించేలా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే రూ. 49 ప్లాన్ ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను, 1జీబీ డేటాను వాడుకోవచ్చని పేర్కొంది.కాగా ఇంత చౌకైన రెంటల్‌ ప్లాన్‌ను మరే ఇతర కంపెనీ కూడా ఆఫర్‌ చేయడం లేదు. కానీ ఇది కేవలం జియోఫోన్‌ యూజర్లకేనని అధికారికంగా ప్రకటించడంతో, జియో వినియోగదారుల్లో కాస్త నిరాశవ్యక్తమైంది. ఆయితే కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా ఈ ప్లాన్‌ను జియోసిమ్‌ వాడే ప్రతి ఒక్కరూ తమ సొంత ఫోన్లలో ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చని తెలిసింది.

4 రూపాయలతో నచ్చిన నెట్‌వర్క్‌లోకి, టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఝలక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇతర ఫోన్లలో కూడా వాడుకోవడానికి..

ఈ ప్లాన్లను ఇతర ఫోన్లలో కూడా వాడుకోవడానికి తొలుత మీ జియోసిమ్‌ను జియోఫోన్‌లో వేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం జియోఫోన్‌ ద్వారా ఈ ప్లాన్లను కొనుగోలు చేసి, యాక్టివేట్‌ చేసుకోవాలి

యాక్టివేట్‌ చేసుకున్న అనంతరం..

జియోఫోన్‌పై ఈ ఆఫర్లను యాక్టివేట్‌ చేసుకున్న అనంతరం, సిమ్‌ను బయటికి తీసి, మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌లో వేసుకోవాలి. కేవలం జియోఫోన్‌లో మాత్రమే ఈ ప్లాన్లను వాడుకోవాలనే నిబంధననేమీ లేదు.

జియో ఫోన్ యూజర్ల కోసం..

అయితే జియో ఫోన్ యూజర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రిలయన్స్‌ రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అవి రూ.153 ప్లాన్‌, రూ.49 ప్లాన్‌. నెల రోజుల వ్యాలిడితో వచ్చిన ఈ రెండు ప్లాన్లు మీ సొంత మొబైల్స్ లో వాడుకునే విధంగా కూడా అందుబాటులో ఉన్నాయి.

పెదవి విరుస్తున్న యూజర్లు

కానీ ముందుగా ఈ ప్లాన్‌ను జియోఫోన్‌లో యాక్టివేట్‌ చేసుకోవడం మాత్రమే చేయాలి. అనంతరం ఏ ఫోన్‌లోనైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు.అయితే దీనిపై యూజర్లు పెదవి విరుస్తున్నారు..జియో ఫోన్ ఎక్కడ అందుబాటులో ఉంటుందని విమర్శలు గుప్పిస్తున్నారు.

రూ.11, రూ.21, రూ.51, రూ.101

కాగా జియో రూ.11, రూ.21, రూ.51, రూ.101 రీచార్జిలతో కూడిన 4 కొత్త యాడాన్ ప్యాక్‌లను విడుదల చేసింది. ఇప్పటికే జియోకు చెందిన పలు ప్లాన్లను వాడే వారు తమ ప్లాన్‌లో లభించే మొబైల్ డేటా మొత్తం అయిపోతే అప్పుడు ఈ డేటా ప్యాక్‌లను వాడుకోవచ్చు. అయితే వీటికి వాలిడిటీ అంటూ ఏదీ ఉండదు. వినియోగదారులు ఇప్పటివరకు వాడుతున్న వ్యాలిడిటీయే వీటికీ వర్తిస్తుంది.

ఎన్నింటినైనా ..

ఈ ప్యాక్‌లలో రూ.11 ద్వారా కస్టమర్లకు రూ.400 ఎంబీ డేటా వస్తుంది. అదే రూ.21 అయితే 1జీబీ డేటా, రూ.51 అయితే 3 జీబీ డేటా, రూ.101 అయితే ఏకంగా 6 జీబీ డేటా వస్తుంది. ఈ ప్యాక్‌లు ఎన్నింటినైనా యూజర్లు రీచార్జి చేసుకోవచ్చు.

వెంటనే యాక్టివేట్ అవవు.

కాకపోతే అవి వెంటనే యాక్టివేట్ అవవు. యూజర్లు తమ జియో అకౌంట్‌లోకి వెళ్లి ఒకసారి ఒక ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రీచార్జిలను ప్రస్తుతం జియో కస్టమర్లు జియో యాప్, వెబ్‌సైట్‌లలో చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Rs. 49 Reliance JioPhone plan can be used on any 4G VoLTE smartphone: Here’s how you can get it
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot