40 బిలియన్ డాలర్ల ఆదాయమే లక్ష్యంగా ముకేష్ అంబానీ కొత్త స్కెచ్

|

దేశీయ టెలికాం రంగంలో పెను విప్లవానికి కారణమైన రిలయన్స్ జియో అన్ని రంగాల్లో అదే విధంగా జోరును కొనసాగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే టెలికాం రంగంలో దిగ్గజాలను కోలుకోలేని దెబ్బతీసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంశాలు మరవకముందే మరో రంగంలో విప్లవాన్ని సృష్టించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ తన బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను ఈ ఏడాదే లాంచ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. జియో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు ఈ సెగ్మెంట్‌లో ఉన్న పోటీ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని క్రెడిట్‌ రేటింగ్‌ కంపెనీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ చెప్పింది. కంపెనీ కోట్ల ఆదాయాన్ని గడించబోతుందని ఈ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.

 

మరొక విప్లవానికి తెరలేపనున్న రిలయన్స్ జియో మరొక విప్లవానికి తెరలేపనున్న రిలయన్స్ జియో

రిలయన్స్‌ ఆదాయాలు..

రిలయన్స్‌ ఆదాయాలు..

రిలయన్స్ జియో ప్రారంభించనున్న కొత్త సర్వీసులతో దాని పేరెంట్ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అదనంగా 5 బిలియన్‌ డాలర్లను చేకూర్చనుందని సీఎల్‌ఎస్‌ఏ ఇండియా తెలిపింది. దీంతో రిలయన్స్‌ ఆదాయాలు ఈబీఐటీడీఏల తర్వాత రూ.40 బిలియన్లుగా ఉండనున్నాయని బ్రోకరేజ్‌ సంస్థ అంచనావేస్తోంది.

పరిస్థితులు మారాయని..

పరిస్థితులు మారాయని..

గతంలో టెలికాం కంపెనీలు ఫైబర్‌-టూ-హోమ్‌లపైన ఎక్కువగా దృష్టిసారించేవి కావని, వైర్‌లెస్‌ బిజినెస్‌లపైనే ఎక్కువగా వృద్ధిని నమోదు చేయాలనుకునేవని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ కార్పొరేట్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మెహుల్‌ సుఖ్‌వాలా చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని టెలికాం దిగ్గజాలు అటు వైపు మొగ్గు చూపుతున్నాయని ఆయన తెలిపారు.

2016లో టెలికాం మార్కెట్‌లోకి..
 

2016లో టెలికాం మార్కెట్‌లోకి..

2016లో టెలికాం మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జియో అమిత వేగంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జియో సునామి ప్రభావానికి కొన్ని టెలికాం కంపెనీలు ఇప్పటికే మూతపడగా.. మరికొన్ని కంపెనీలు విలీన బాట పట్టాయి. ఉచిత కాలింగ్‌, ఉచిత డేటా రూపంలో జియో ఈ ధరల యుద్ధానికి తెరతీసింది. 16 నెలల అనంతరం జియో తొలిసారి లాభాలను సైతం నమోదు చేసింది.

బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల రంగంలోనూ ..

బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల రంగంలోనూ ..

ఈ సునామి ఊపులోనే బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల రంగంలోనూ తనదైన సత్తా చాటాలని జియో ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన అర్బన్‌ ప్రాంతాల్లో ఉచితంగా హై-స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆఫర్‌ చేస్తోంది.

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగానే..

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగానే..

కాగా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగానే 100ఎంబీపీఎస్‌ స్పీడు మొదలుకొని డేటా ప్లాన్లను అందించాలని జియో చూస్తోంది. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తున్న సంస్థల కన్నా తక్కువ ధర ఎక్కువ స్పీడుతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు జియో తెలిపింది.

ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి తెర..

ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి తెర..

ఇదిలా ఉంటే రిలయన్స్ జియో మరో విప్లవానికి తెరలేపబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టెలికాం సర్వీసులు, స్మార్ట్‌ఫోన్లు, 4జీ ఫీచర్‌ ఫోన్‌ వంటి వాటితో ఇప్పటికే మార్కెట్‌లో తిరుగులేకుండా ఉన్న జియో.. ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి తెరతీయబోతోందని తెలుస్తోంది. తన ARPU(యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌)ను పెంచుకోవడం కోసం సిమ్‌ కార్డుతో కూడిన ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీనిపై ఇప్పటికే అమెరికా చిప్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌తో ముకేష్‌ అంబానీకి చెందిన జియో కంపెనీ చర్చలు కూడా జరిపిందని సమాచారం.అయితే ఈ విషయంపై స్పందించడానికి రిలయన్స్‌ జియో నిరాకరించింది.

Best Mobiles in India

English summary
Reliance Jio’s broadband plans can change India’s telecom landscape More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X