జియో రూ. 149 ప్లాన్‌లో భారీ మార్పులు !
వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్లను రూపొందిస్తున్న జియో.. తాజాగా నెలవారీ రూ.149 ప్లాన్‌లో కీలక మార్పు చేసింది.
రిలయన్స్ జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నో సంచలనాలకు వేదికైంది. దిగ్గజాలను ఓ ఆట ఆడేసుకుంది. ఏడాది పూర్తి చేసుకున్న జియో ఇప్పటికే పలు టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేసింది. కొన్ని కొత్త ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్లను రూపొందిస్తున్న జియో.. తాజాగా నెలవారీ రూ.149 ప్లాన్‌లో కీలక మార్పు చేసింది.

రూ.149 ప్లాన్
ఇప్పటి వరకు రూ.149 ప్లాన్ ద్వారా 2 జీబీ 4జీ డేటాతో పాటు, 300 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది.

2 జీబీ డేటా పరిమితి దాటిన తర్వాత
ఈ ప్లాన్‌లో 2 జీబీ డేటా పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్ వాడుకునే వీలు లేదు. దీంతో ఇంటర్నెట్ వాడుకోవాలంటే వినియోగదారుడు మళ్లీ బూస్టర్ ప్యాక్స్ వేసుకోవాల్సిన పరిస్థితి.

2జీబీ పరిమితి దాటిన తర్వాత కూడా..
తాజాగా ఈ ప్లాన్‌లో కీలక మార్పులు చేసింది జియో. ఇతర సదుపాయాలను అలానే ఉంచి రూ.2జీబీ పరిమితి దాటిన తర్వాత కూడా డేటాను వాడుకునే అవకాశం కల్పిస్తోంది.

64 కేబీపీఎస్ వేగంతో
64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకునే వెసులుబాటు కల్పిస్తోంది. తక్కువ డేటా ఉపయోగించే వారికి మాత్రం ఇది నిజంగా శుభవార్తే! ఇతర ప్లాన్లలో ఈ సదుపాయం ఇప్పటికే ఉంది.

వారం రోజుల ప్లాన్ రూ. 96లో కూడా
దీంతో పాటు వారం రోజుల ప్లాన్ రూ. 96లో కూడా జియో ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టింది. డేటా అయిపోయిన తరువాత కూడా డేటాను వాడుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్లాన్ లో జియో వేగం డేటా అయిపోయిన తరువాత 128 కేబీపీఎస్ ఉంటుంది.

ఈ ఆఫర్లను పొందాలంటే
జియో యూజర్లు ఈ ఆఫర్లను పొందాలంటే జియో వైబ్‌సైట్ జియో. కామ్ ద్వారా కాని మై జియో యాప్ ద్వారా కాని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








