రిలయన్స్ నంచి అంతర్జాతీయ రోమింగ్ పథకాలు

Posted By:

దేశంలోని ప్రముఖ టెలికం ఆపరేటర్ లలో ఒకటైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సరికొత్త అంతర్జాతీయ రోమింగ్ పథకాలతో ముందుకొచ్చింది. ప్రత్యేకించి విదేశాల్లో పర్యటించే జీఎస్ఎమ్ పోస్ట్ పెయిడ్ ఖాతాదారులు ఈ రోమింగ్ ప్యాక్‌లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు.

రిలయన్స్ నంచి అంతర్జాతీయ రోమింగ్ పథకాలు

ప్రత్యేకించి యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటించే వాళ్లకోసం రూ.849 రోమింగ్ ప్యాక్‌ను రిలయన్స్ ఆవిష్కరించింది. ఈ పథకంలో భాగంగా రూ.849 చెల్లించినట్లయితే... అక్కడ నుంచి భారత్‌కు కాల్ చేసుకునేందుకు రూ.25, 1 ఎంబి డేటాను వినియోగించుకున్నందుకు రూ.25 ఖర్చవుతుందని రిలయన్స్ వెల్లడించింది.

ఉత్తర అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియాలో ప్రాంతాల్లోని 42 ప్రాంతాల్లో పర్యటించే వారికోసం రూ.999 విలువ చేసే పథకాన్ని రిలయన్స్ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా 92శాతం కాల్ రాయితీలను వినియోగదారులు పొందవచ్చు. అమెరికా వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా నెలవారీ రూ.849 అద్దె పథకాన్ని ఆర్‌కామ్ ప్రకటించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot