జియో 5G నెట్‌వర్క్‌ విడుదలపై ఆసక్తికరమైన విషయాలు తెలిపిన ఆకాష్ అంబానీ

|

భారతదేశంలోనే నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో అతి త్వరలోనే 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నట్లు కొన్ని సూచనలను అందించింది. టెల్కో యొక్క పోటీదారులైన వొడాఫోన్ ఐడియా (Vi) మరియు భారతి ఎయిర్‌టెల్‌ల సంస్థల మాదిరిగా కాకుండా జియో సంస్థ దాని 5G ప్లాన్‌లు మరియు ట్రయల్స్ గురించి చాలా వరకు నిశ్శబ్దంగా ఉంది. రిలయన్స్ జియో చైర్మన్ గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన ఆకాష్ అంబానీ 5G రోల్‌అవుట్‌కి సంబందించి కొన్ని వివరాలను విడుదల చేసారు. "మేము పాన్ ఇండియా 5G రోల్‌అవుట్‌తో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ని జరుపుకుంటాము. అలాగే ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా సరసమైన ధరలోనే 5G మరియు 5G-ఎనేబుల్డ్ సేవలను వినియోగదారులకి అందించడానికి కట్టుబడి ఉంది." అని ప్రకటనలు చేసారు.

 

5G నెట్‌వర్క్‌

భారతదేశంలో 5G నెట్‌వర్క్‌ కోసం జరిగిన వేలంలో జియో తన యొక్క 5G సేవలను విస్తృతంగా విడుదల చేయడానికి తగినంత స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఈ స్పెక్ట్రమ్ వేలంలో జియో టెలికాం సంస్థ 5G సేవల కోసం అధికంగా రూ.88,078 కోట్లకు పైగా వెచ్చించి. ఇతర టెల్కోలు ఏవీ కూడా ఇంత భారీ మొత్తంలో వెచ్చించి ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం జియో టెల్కో అధికంగా 700 MHz ఎయిర్‌వేవ్‌లను కలిగి ఉంది.

5G స్పెక్ట్రమ్ వేలం

భారతదేశంలో నిర్వహించిన మొట్టమొదటి తాజా 5G స్పెక్ట్రమ్ వేలంలో మొత్తం 5G ఎయిర్‌వేవ్స్ స్పెక్ట్రమ్‌లో 71 శాతం కోసం 1,50,173 కోట్ల రూపాయల విలువైన బిడ్‌లను చూసింది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 72,098 MHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయగా అందులో 51,236 MHz విక్రయించబడింది. రిలయన్స్ జియో మొత్తం 22 సర్కిల్‌లలో 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడానికి వీలుగా కంపెనీ 700MHz, 800MHz, 1800MHz, 3300MHz మరియు 26GHz బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ హక్కును పొందింది. రిలయన్స్ జియో భారతదేశం అంతటా 5G సేవలను అందించే ఏకైక ఆపరేటర్‌గా 700 MHz స్పెక్ట్రమ్ ను కలిగి ఉంది. ఈ స్పెక్ట్రమ్ 5-10 కి.మీ పరిధిలో 5G నెట్‌వర్క్ వేగాన్ని అందించగలదు.

5G లాంచ్ గురించి ఆసక్తి ప్రకటన చేసిన ఆకాష్ అంబానీ
 

5G లాంచ్ గురించి ఆసక్తి ప్రకటన చేసిన ఆకాష్ అంబానీ

ఆకాష్ అంబానీ 5G లాంచ్ కి సంబందించిన వివరాలు చాలా సూటిగా ఉన్నాయి. అయితే జియో దీన్ని ఎలా అమలు చేస్తుందో చూడటం ఇక్కడ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఒక్క 5G నెట్‌వర్క్ కూడా అందుబాటులో లేదు. ఇప్పటివరకు ఉన్న అన్ని 5G నెట్‌వర్క్‌లు ట్రయల్ ప్రయోజనాల కోసం స్పెక్ట్రమ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కేటాయించింది.

జియో

రిలయన్స్ జియో టెలికాం సంస్థ తన 5G సేవల గురించి చాలా వివరాలను విడుదల చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా వినియోగదారులు ఖచ్చితంగా 5G SIMకి మారవలసి ఉంటుంది. దీన్ని త్వరగా అందుబాటులోకి వచ్చేలాగా చేయగలిగితే కనుక జియో దాని పోటీదారుల కంటే సూపర్ మాసివ్ ఫస్ట్ మూవర్ ప్రయోజనాన్ని పొందుతుంది. అయితే ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా సంస్థలు తమ యొక్క 5G సేవలను ఇండియాలో ఎప్పుడు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాయో వంటి వివరాలు ఖచ్చితంగా తెలియదు. ఇతర టెల్కోలు కూడా ఆగస్టు 15, 2022 నాటికి వాణిజ్య 5Gని ప్రారంభించేందుకు సిద్ధమై ఉండవచ్చు.

జియో ప్లాట్‌ఫారమ్‌

జియో ప్లాట్‌ఫారమ్‌ల మాతృసంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) స్టాక్ మార్కెట్‌లో సోమవారం మంచి రోజు వచ్చింది. సమ్మేళనం యొక్క స్టాక్ 2.61% పెరిగి రూ.2574.85 వద్ద ముగిసింది. నేడు కూడా అదే పరిస్థితి కనబడే అవకాశం ఉంది. జియో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ మొత్తం దానిని పూర్తిగా భిన్నమైన లీగ్‌లో ఉంచుతుంది.

టెలికాం సంస్థలు అన్ని పొందిన స్పెక్ట్రమ్ మొత్తం:

టెలికాం సంస్థలు అన్ని పొందిన స్పెక్ట్రమ్ మొత్తం:

ఎయిర్‌టెల్: 19,867.8 MHz - రూ. 43,084 కోట్లు

జియో: 24,740 MHz - రూ. 88,078 కోట్లు

వోడాఫోన్ ఐడియా: 6228.4 MHz - రూ. 18,799 కోట్లు

అదానీ: 400 MHz - రూ. 212 కోట్లు

 

600 MHz/700 MHz/800 MHz/900 MHz - సబ్-1 GHz బ్యాండ్‌లలో

600 MHz/700 MHz/800 MHz/900 MHz - సబ్-1 GHz బ్యాండ్‌లలో

600 MHz బ్యాండ్ మొదటిసారి వేలం వేయబడింది. కానీ టెల్కోలు అన్ని కూడా దీనిని కొనుగోలు చేయడం కోసం ఎటువంటి ఆసక్తిని కనబరచలేదు. అయితే 600 MHzలో 10 MHz స్పెక్ట్రమ్ మాత్రం 5G సేవల కోసం BSNL/MTNL కోసం రిజర్వ్ చేయబడింది. 700 MHz బ్యాండ్‌లో 10 MHz స్పెక్ట్రమ్‌ని పొందిన ఏకైక టెల్కో జియో మాత్రమే . ఎయిర్‌టెల్ టెల్కో 900 MHz బ్యాండ్‌లోని మూడు సర్కిల్‌లలో కొంత స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉంచింది. 1 GHz బ్యాండ్‌లలో వోడాఫోన్ ఐడియా భాగస్వామ్యం కలిగిలేదు.

1800 MHz/2100 MHz/2300 MHz/2500 MHz

1800 MHz/2100 MHz/2300 MHz/2500 MHz

ఎయిర్‌టెల్ తన స్పెక్ట్రమ్ హోల్డింగ్‌లను పటిష్టం చేయడానికి 1800 MHz మరియు 2100 MHz బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్ జియో టెలికాం సంస్థ తన హోల్డింగ్‌లను పెంచుకోవడానికి కేవలం 1800 MHz బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. వోడాఫోన్ ఐడియా కూడా 1800 MHz, 2100 MHz మరియు 2500 MHz బ్యాండ్‌లలో మాత్రమే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. కానీ హై బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను గెలుచుకోవడంలో ఎయిర్‌టెల్ మరియు జియో సంస్థలు రెండూ కూడా దూకుడుగా పాల్గొన్నాయి. వోడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్‌ను అధిక బ్యాండ్‌లలో దాని ప్రాధాన్యత గల సర్కిల్‌లలో మాత్రమే కొనుగోలు చేసింది.

Best Mobiles in India

English summary
Reliance New Chairman Akash Ambani Hints: Jio All Set to Launch Pan-India 5G Network on August 15, 2022

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X