రిలయన్స్ జియో JioFi అందుబాటు ధరలో కొత్త ప్లాన్‌లను అందిస్తున్నది!!

|

రిలయన్స్ జియో టెలికాం సంస్థ నెట్‌వర్క్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్ద పనిచేసే వినియోగదారుల కోసం JioFi వంటి చిన్న హాట్‌స్పాట్ డివైస్ ని పరిచయం చేసింది. ఇది ప్రస్తుతం మూడు వేర్వేరు పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌లను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇందులో బేస్ ప్లాన్ రూ.249 ధర వద్ద లభించగా మిగిలిన ప్లాన్లు వరుసగా రూ.299 మరియు రూ.349 ధరల వద్ద లభిస్తాయి. ఈ ప్లాన్‌లు ప్రత్యేకంగా ఎంటర్‌ప్రైజెస్ లేదా బిజినెస్ అవసరాల కోసం ఉద్దేశించినవి. ఈ చిన్న Wi-Fi హాట్‌స్పాట్ డివైస్లను ఉపయోగించి ఇంటి వద్ద ఉండి పనిచేసే ఉద్యోగులు తమ యొక్క పనిని ఎక్కడి నుండైనా సజావుగా పూర్తి చేయడానికి అనుమతిని ఇస్తాయి. ఈ ప్లాన్‌ల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి చదవండి.

 

JioFi రూ 249 ప్లాన్

JioFi రూ 249 ప్లాన్

JioFi రూ.249 ధర వద్ద అందించే బేసిక్ ప్లాన్ 30GB నెలవారీ డేటాతో వస్తుంది. ఇది రిలయన్స్ జియో ద్వారా జియోఫై కోసం అందించే బేస్ ఎంటర్‌ప్రైజ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్. JioFi ప్లాన్‌లతో ఎటువంటి SMS లేదా వాయిస్ ప్రయోజనాలు అందించబడవు. వినియోగదారులు ఈ ప్లాన్‌ని ఎంచుకుంటే దానితో 18 నెలల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుందని గమనించండి.

JioFi రూ 299 ప్లాన్

JioFi రూ 299 ప్లాన్

JioFi డివైస్ల కోసం అందుబాటులో ఉండే మరొక ప్లాన్ రూ.299 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 40GB నెలవారీ డేటాతో బండిల్ చేయబడి వస్తుంది. ఈ ప్లాన్‌తో లాక్-ఇన్ పీరియడ్ కూడా 18 నెలలు వరకు ఉంటుంది. FUP (ఫెయిర్-యూసేజ్-పాలసీ) డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 64 Kbpsకి పడిపోతుంది.

JioFi రూ. 349 ప్లాన్
 

JioFi రూ. 349 ప్లాన్

JioFi డివైస్ల కోసం చివరగా రిలయన్స్ జియో అందించే ప్లాన్ రూ.349 ధరతో లభిస్తుంది. ఈ జియోఫై ప్లాన్‌తో ఎంటర్‌ప్రైజెస్ అదే 18 నెలల లాక్-ఇన్ పీరియడ్‌తో నెలకు 50GB డేటాను అందిస్తుంది. రిలయన్స్ జియో అందించిన JioFi డివైస్ ఉచితంగా అందించబడుతుంది. కానీ దీని యొక్క ఉపయోగం మరియు రాబడి ఆధారంగా దీనిని అందించబడుతుంది. ఇంకా ఈ పరికరాలను ఆర్డర్ చేసే ఏదైనా ఎంటర్‌ప్రైజ్/కంపెనీ కనీసం 200 పరికరాలకు చెల్లించాల్సి ఉంటుంది.

JioFi ఫీచర్లు

JioFi ఫీచర్లు

JioFi హాట్‌స్పాట్ డివైస్ పరిమాణంలో చాలా చిన్నది ఉండి ఎక్కడికైనా తీసుకొనివెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఇది వరుసగా 150 Mbps మరియు 50 Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగాన్ని అందించగలదు. ఇది 2300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండడంతో ఇది సులభంగా ఐదు నుండి ఆరు గంటల బ్రౌజింగ్ సమయాన్ని సపోర్ట్ చేస్తూ ఒక USB కనెక్షన్‌తో ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ గాడ్జెట్ గరిష్టంగా 10 పరికరాలను కనెక్ట్ చేయడానికి వీలును కల్పిస్తుంది. ఆసక్తి ఉన్న ఎంటర్‌ప్రైజెస్/యూజర్‌లు దీనిని ఆర్డర్ చేయడానికి రిలయన్స్ జియోని సంప్రదించవచ్చు. JioFi అంతకుముందు సాధారణ వినియోగదారులు మరియు ప్రజలలో కూడా ప్రజాదరణ పొందింది.

జియోఫైబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్

జియోఫైబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్

జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు కొత్తగా అందుబాటులోకి తీసుకొనివచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.399 లేదా రూ. 699 ప్లాన్‌కి పొడిగింపుగా ఉంటుంది. మీరు ముందుగా ఈ ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు చేసి ఆపై నెలకు రూ.100తో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను పొందాలి. ఇలా పొందిన వినియోగదారులు ఆరు OTT యాప్‌లను ఉచితంగా యాక్సిస్ చేయడానికి అనుమతిని పొందుతారు. మీకు మరిన్ని OTT యాప్‌లకు యాక్సెస్ కావాలంటే కనుక మీరు ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇది నెలకు రూ.200 ధరతో లభిస్తుంది. ఇది 14 OTT యాప్‌లను ఉచితంగా యాక్సెస్ చేయడనికి అనుమతిని ఇస్తుంది. ఈ ప్లాన్‌లు జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ప్రీపెయిడ్ జియోఫైబర్ కస్టమర్ అయితే కనుక ఈ కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను పొందడానికి మీరు ముందుగా పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌గా మారవలసి ఉంటుంది. మీరు కంపెనీ నుండి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తున్నట్లయితే మీరు జియో సెట్-టాప్ బాక్స్ (STB)ని కూడా క్లెయిమ్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Offers Three Affordable Postpaid Tariff Plans For JioFi Hotspot Device: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X