ఇప్పుడు రిలయన్స్ వంతు!

Posted By: Staff

ఇప్పుడు రిలయన్స్ వంతు!

 

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) 3జి ధరలను 61 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 3జి వినియోగదారుల కోసం 250 రూపాయలకే 1 జిబి డౌన్ లోడ్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నట్లు ఆర్‌కామ్ తెలిపింది. ఆ తర్వాత ఒక్కో ఎంబి వినియోగానికి 20 పైసలు చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ పేర్కొంది. అలాగే 2జిబి డౌన్‌లోడ్‌ను 450 రూపాయలకు అందించనున్నట్లు ఆర్‌కామ్ తెలిపింది. గతంలో ఈ చార్జీలు 650, 710 రూపాయలుగా ఉన్నాయి. కస్టమర్లకు అత్యున్నతమైన హైస్పీడ్ బ్రాండ్‌బ్యాండ్ సర్వీసులను అందించే ఉద్దేశంతో టారిఫ్‌లను తగ్గించినట్లు ఆర్‌కామ్ గ్రూప్ హెడ్ సంజయ్ బెహాల్ తెలిపారు. ఈ కొత్త ప్లాన్ దేశవ్యాప్తంగా 13 సర్కిళ్లలోని 333 పట్టణాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

3జీ టారిఫ్‌ల పై 70శాతం తగ్గింపు: ఐడియా

3జీ సర్వీసుల టారిఫ్‌లను 70% వరకూ తగ్గిస్తున్నామని ఐడియా సెల్యులార్ ప్రకటించింది. గత వారంలో 3జీ టారిఫ్‌లను భారతీ ఎయిర్‌టెల్ తగ్గించిన విషయం తెలిసిందే. 10 కేబీ డేటాకు 10 పైసలుగా ఉన్న రేటును 3 పైసలకు తగ్గిస్తున్నామని, ప్రి పెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఇది వర్తిస్తుందని ఐడియా పేర్కొంది. వివిధ ప్లాన్‌ల కింద యూసేజ్ లిమిట్‌ను కూడా పెంచామని తెలిపింది. రూ. 10కి 30 నిమిషాల హై స్పీడ్ ఇం టర్నెట్ సర్ఫింగ్‌ను(ఒక్క రోజు వ్యాలిడిటి), రూ. 25కు 100 ఎంబీ డేటాను(3రోజుల వ్యాలిడిటీ) ఆఫర్ చేస్తున్నామని వివరించింది. రోజుకు రూ.8కి అన్‌లిమిటెడ్ 3జీని ఎయిర్‌సెల్ ఆఫర్ చేస్తోం ది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు 3జీ టారిఫ్‌లను తగ్గిస్తాయని విశ్లేషకులంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot