ఇ-కామర్స్ వ్యాపారంలోకి రిలయన్స్ రిటైల్!

Posted By:

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ఆన్‌లైన్ షాపింగ్ విస్తరిస్తున్న నేపధ్యంలో ‘ఇ-కామర్స్' వ్యాపారంలోకి ప్రవేశించేందుకు ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియ ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. రిలయన్స్ రిటైల్‌కు చెందిన ఓ టెక్నికల్ బృందం ఈ ప్రాజెక్టు పై శ్రమిస్తున్నట్లు ఓ ప్రముఖ మీడియా వెల్లడించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇ-కామర్స్ వ్యాపారంలోకి రిలయన్స్ రిటైల్!

ఆన్‌లైన్ షాపింగ్ విభాగంలో ఆమెజాన్, ఈ-బే వంటి ప్రముఖ అంతర్జాతీయ ఇ-కామర్స్ వైబ్‌సైట్‌లు భారత్‌లో తమ హవాను కొనసాగిస్తున్నాయి. రిలయన్స్ తాజా వ్యూహం‌తో ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్లో పోటీ వాతరవణం నెలకునే అవకాశం ఉంది. రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 1500 స్టోర్లు ఉన్నాయి.

ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్లో దేశవాళీ రిటైలింగ్ వెబ్‌సైట్‌ల జోరు కొనసాగుతోంది. వీటి సంఖ్య 75 నుంచి 100 వరకు ఉండొచ్చని అంచనా. ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య రోజురోజుకు రెట్టింపవటంతో ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య గణనీయంగా పెరగుతోంది. దీంతో ‘ఇ-కామర్స్' వ్యాపారం మూడు పవ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot