అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు భారీ షాక్ ఇవ్వబోతున్న అంబానీ

వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌, అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లకు రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ భారీ షాక్ ఇవ్వబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

|

వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌, అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లకు రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ భారీ షాక్ ఇవ్వబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రిలయన్స్ జియో రీటెయిల్ రంగంలోకి ప్రవేశిస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు పోటీగా రిలయన్స్‌ రిటైల్‌, స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లను ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపట్టేందుకు ఓ వెంచర్‌ ఏర్పాటు చేసినట్టు రిలయన్స్ వర్గాల సమాచారం. రిలయన్స్‌ రిటైల్‌, దేశీయ అతిపెద్ద బ్రిక్‌ అండ్‌ మోర్టర్‌ రిటైలర్‌ చైన్‌. ఇది తాజాగా ఆన్‌లైన్‌గా అరంగేట్రం చేసింది.

భారీగా పెరగనున్న టీవీ ధరలు, ఇప్పుడు కొనడమే బెటర్ !భారీగా పెరగనున్న టీవీ ధరలు, ఇప్పుడు కొనడమే బెటర్ !

ఆన్‌లైన్‌గా విక్రయించడానికి..

ఆన్‌లైన్‌గా విక్రయించడానికి..

స్మార్ట్‌ఫోన్లను,ఎలక్ట్రానిక్స్‌ను ఆన్‌లైన్‌గా విక్రయించడానికి రిలయన్స్‌ రిటైల్‌ ఓ ఆన్‌లైన్‌ షాపును లాంచ్‌ చేయబోతుందని తెలుస్తోంది.

55 శాతం నుంచి 60 శాతం వ్యాపారాన్ని

55 శాతం నుంచి 60 శాతం వ్యాపారాన్ని

స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, ఎలక్ట్రానిక్స్‌ కేటగిరీలు దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు సుమారు 55 శాతం నుంచి 60 శాతం వ్యాపారాన్ని అందిస్తున్న నేపథ్యంలో టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ను ఆన్‌లైన్‌లో విక్రయాలు చేపట్టడానికి రిలయన్స్‌ రిటైల్‌ సిద్ధమైంది.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు సరితూగే ఆఫర్లను..

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు సరితూగే ఆఫర్లను..

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు సరితూగే ఆఫర్లను కూడా ఇది ఆఫర్‌ చేయబోతుంది. ఇతర ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ల మాదిరిగా పాత మోడల్స్‌పై, ఎక్స్‌క్లూజివ్‌ మోడల్స్‌పై ఎప్పడికప్పుడూ భారీ డిస్కౌంట్లను రిలయన్స్‌ రిటైల్‌ ఆఫర్‌ చేయనుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు.

ఇతర ప్రొడక్ట్‌లు..

ఇతర ప్రొడక్ట్‌లు..

ఇతర ప్రొడక్ట్‌లు కూడా రిలయన్స్‌ డిజిటల్‌ ఆఫ్‌లైన్‌ స్టోర్‌ ధరలకు సమానంగా ఉండనున్నాయని తెలిపారు. రిలయన్స్‌ డిజిటల్‌ ఇప్పటికే తన ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఎల్‌జీ, శాంసంగ్‌, సోనీ, షియోమి, పానాసోనిక్‌ వంటి టాప్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లను తక్కువ రేటుకే అందిస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 38 శాతం..

స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 38 శాతం..

ఆన్‌లైన్‌లో దేశీయ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 38 శాతం, టెలివిజన్లు 12 శాతం, అప్లియెన్స్‌ 6-7 శాతం ఆక్రమించుకుంటున్నాయి. పర్సనల్‌ కేర్‌ గాడ్జెట్లు 15 నుంచి 20 శాతం ఆన్‌లైన్‌ షేరును కలిగి ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎం మాల్‌..

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎం మాల్‌..

దేశంలో ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎం మాల్‌, షియోమి ఎంఐ ఆన్‌లైన్‌ స్లోర్‌లే స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ విక్రయాల్లో దేశీయ అతిపెద్ద ఆన్‌లైన్‌ స్టోర్‌లుగా ఉన్నాయి.

ఫ్యాషన్‌ ఫార్మట్‌ల కోసం

ఫ్యాషన్‌ ఫార్మట్‌ల కోసం

ప్రస్తుతం రిలయన్స్‌ తన ఫ్యాషన్‌ ఫార్మట్‌ల కోసం ఈ-కామర్స్‌ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ గ్రోసరీ, ఎఫ్‌ఎంసీజీ, పండ్లు, కూరగాయల కోసం రిలయన్స్‌ స్మార్ట్‌ను కూడా నడుపుతోంది. 

మరింత విస్తరించడానికి

మరింత విస్తరించడానికి

అయితే ఇది కేవలం ముంబై, పుణే, బెంగళూరులకే విస్తరించి ఉంది. రిలయన్స్‌ స్మార్ట్‌ను మరింత విస్తరించడానికి కంపెనీ ప్లాన్‌ చేసింది.

Best Mobiles in India

English summary
Walmart-owned Flipkart and Amazon may soon face intense competition from Mukesh Ambani’s Reliance Retail, which has just ventured into online sales of smartphones, televisions, refrigerators and air-conditioners, two senior industry executives said. More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X