Reliance Jio 5G గురించి ఆసక్తికరమైన విషయం...
రిలయన్స్ జియో మొదటి నుండి పూర్తిగా తన 5G సెగ్మెంట్ డిజైన్ ను అభివృద్ధి చేస్తున్నది. ఇది భారతదేశంలో 100 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను మరియు పరిష్కారాలను ఉపయోగించి ప్రపంచ స్థాయి 5G సేవలను ప్రారంభించటానికి సహాయపడుతుంది.

రిలయన్స్ జియో 5G నెట్‌వర్క్
ఇండియాలో 5G స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే దీని యొక్క ట్రయల్స్ మొదలుకానున్నాయి. అలాగే దీనితో పాటుగా వచ్చే ఏడాది ఫీల్డ్ డిప్లాయ్‌మెంట్‌కు సిద్ధంగా ఉంటున్నట్లు RIL కంపెనీ యొక్క 43 వ వార్షికోస్తవ సమావేశంలో (AGM) ముఖేష్ అంబానీ ఈ ప్రకటన చేశారు.

5G అంటే ఏమిటి
5G అనేది తరువాతి తరం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్. ఇది 4G LTE కనెక్షన్‌ను భర్తీ చేస్తుంది. 5G తో మీరు ముందు కంటే అతి వేగవంతమైన డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగాన్ని ఆశించవచ్చు. అలాగే 5G అనేది తక్కువ జాప్యాన్ని కూడా ఇస్తుంది.

ఇండియాలో 5G స్పెక్ట్రం వేలం
5G స్పెక్ట్రం యొక్క వేలం ఇండియాలో ఇంకా జరగలేదు. ఇండియాలో ప్రస్తుతం టెలికాం పరిశ్రమ ఆర్ధిక పరంగా కొన్ని సమస్యలను ఎదురుకుంటున్నది. ఈ కారణాల వలన భారత ప్రభుత్వం 2021కు ప్రణాళికాబద్ధమైన 5G స్పెక్ట్రం వేలంను ఆలస్యం చేసింది.

జియో 5G ప్లాట్‌ఫాం
జియో ప్లాట్‌ఫాంలో ఇప్పటికే 4G, 5G, క్లౌడ్ కంప్యూటింగ్, డివైజెస్ అండ్ ఓఎస్, బిగ్ డేటా, AI, AR / VR, బ్లాక్‌చెయిన్, నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, కంప్యూటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రపంచ స్థాయి సామర్థ్యాలను నిర్మించడానికి 20 కి పైగా స్టార్ట్‌అప్ లను భాగస్వాములగా చేర్చుకున్నది అని అంబానీ తెలిపారు.

జియో 5G ఉపయోగం
జియో 5G యొక్క కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, వాణిజ్యం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ తయారీ మరియు స్మార్ట్ మొబిలిటీ వంటి బహుళ పరిశ్రమలలో పర్యావరణ వ్యవస్థలకు అనుగుణంగా అద్భుతమైన పరిష్కారాలను సృష్టించగలము అని RIL AGM సమావేశంలో అంబానీ అన్నారు.
జియో 5G సాయంతో రాబోయే కొన్నేళ్లలో ఇండియా సమగ్రమైన రోల్ అవుట్ ను చూస్తుంది. భవిష్యత్తులో జియో ప్రపంచవ్యాప్తంగా ఇతర టెలికాం ఆపరేటర్లకు కూడా 5G సొల్యూషన్స్ పూర్తిస్థాయిలో ఎగుమతిదారుగా ఉండబోతోంది అని తెలిపారు.


Click it and Unblock the Notifications








