రిలయన్స్ ఎమర్జెన్సీ టాక్‌లోన్ సర్వీస్

Posted By:

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తమ ప్రీ-పెయిడ్ జీఎస్ఎమ్ కస్టమర్‌ల కోసం సరికొత్త టాక్‌లోన్ సర్వీస్ (TalkLoan service)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయంతో రిలయన్స్ జీఎస్ఎమ్ యూజర్లు తమ ఫోన్ బ్యాలన్స్ రూ.10కంటే తక్కువుగా ఉన్నప్పుడు టాక్‌లోన్ సర్వీస్‌లో భాగంగా తక్షణ లోన్ క్రింది రూ.5, రూ.10 బ్యాలన్స్‌లను పొందవచ్చు.

మాట్లాడుకునేందుకు రిలయన్స్ అప్పులిస్తోంది

అత్యవసర పరిస్థితుల్లో, రీచార్జ్ చేసుకోవడానికి వీలుకాని సందర్భాల్లో తమ టాక్‌లోన్ సర్వీస్ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపంది. లోన్ రూపంలో పొందిన బ్యాలన్స్‌ను కస్టమర్ తరువాతి రీచార్జ్‌లో కంపెనీ మినహాయిస్తుంది. ఆ తరువాత మళ్లి అవసరమైనపుడు టాక్‌లోన్ సర్వీస్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.

టాక్‌లోన్ సర్వీసును పొందేందుకు రిలయన్స్ జీఎస్ఎమ్ ప్రీపెయిడ్ ఖాతాదారులు తమ ఫోన్ నుంచి *141# నెంబర్‌కు డయల్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత లోన్ విలువను సెలక్ట్ చేసుకున్నట్లయితే అకౌంట్‌లో జమ అవుతుంది. ఇవే తరహా ఎమర్జెన్సీ రీచార్జ్ సర్వీసులను వొడాఫోన్ ఇంకా ఎయిర్‌టెల్‌లు మార్కెట్లో ఇప్పటికే అందిస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Reliance TalkLoan Emergency Rs. 10 Recharge Launched. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting