వారెవ్వా : జియో యూజర్లకు దసరా సంబరాల గిఫ్ట్

Written By:

టెలికం మార్కెట్లో సంచలనాలు నమోదు చేస్తున్న జియో తన 4 జీ ఫీచర్‌ ఫోన్‌ ను నవరాత్రి కానుకగా కస్టమర్లను అందిచనుంది. జియో వినియోగదారులు తన మొదటి ఫీచర్‌ఫోన్‌తో ఈ ఏడాది దసరా సంబరాలను జరుపుకునేలా ప్లాన్‌ చేసింది.

అనుమానాలన్నీ పటాపంచల్, ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు వెల్లడించిన జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

60 లక్షల మందికి

ప్రీ బుకింగ్‌ చేసుకున్న 60 లక్షల మందికి సెప్టెంబర్‌ 21 నుంచి డెలివరీ చేయనున్నట్లు రిలయన్స్‌ జియో పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరోగుడ్‌ న్యూస్‌ ఏమిటంటే

అలాగే మరోగుడ్‌ న్యూస్‌ ఏమిటంటే... త్వరలోనే కొత్త ప్రీ బుకింగ్‌లను కూడా ప్రారంభించనుందని తెలుస్తోంది.

మూడు గంటల్లోనే

జియో ఫోన్‌ కోసం ఆగస్టు 24 న ముందస్తు బుకింగ్ మొదలుకాగా కేవలం మూడు గంటల్లోనే సుమారు 60 లక్షల యూనిట్ల జయో ఫీచర్ ఫోన్లు బుక్‌ అయ్యాయి. దీంతో బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని

అయితే వినియోగదారుల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని, బుకింగ్ ప్రక్రియ పునఃప్రారంభించనుందని, ఈ సమాచారాన్ని కస్టమర్లకు అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రాధాన్యత ఆధారంగా

అలాగే ప్రాధాన్యత ఆధారంగా వీటిని అందించనుంది. కాబట్టి ఫోన్ కొరకు ఎదరుచూసేవారు బుకింగ్ లో ఫాస్ట్ గా ఉండటం మంచిది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance to commence JioPhone delivery during Navratri; pre-booking to resume soon Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot