రిలయన్స్‌ని ఢీకొట్టేదెవరు,ముఖేష్ అంబానీ ఆదాయం తెలిస్తే షాకే

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్ఐఎల్) మరో అరుదైన ఘనత సాధించింది. ఆదాయం పరంగా ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ను (ఐవోసీ) వెనక్కు నెట్టింది. దీంతో రిలయన్

|

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్ఐఎల్) మరో అరుదైన ఘనత సాధించింది. ఆదాయం పరంగా ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ను (ఐవోసీ) వెనక్కు నెట్టింది. దీంతో రిలయన్స్ ఆదాయం పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరరించింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రెండో స్థానానికి జారుకుంది.

రిలయన్స్‌ని ఢీకొట్టేదెవరు,ముఖేష్ అంబానీ ఆదాయం తెలిస్తే షాకే

గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రిలయన్స్‌ టర్నోవర్‌ రూ.6.23 లక్షల కోట్లకు పుంజుకోగా.. ఐఓసీ రాబడి రూ.6.17 లక్షల కోట్లుగా నమోదైంది. అంతేకాదు, దేశంలో అత్యంత లాభదాయక కంపెనీల్లోనూ రిలయన్స్‌దే అగ్రపీఠంగా చెప్పవచ్చు.

ఇతర అంశాల్లోనూ అగ్రస్థానం

ఇతర అంశాల్లోనూ అగ్రస్థానం

రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం ఆదాయంలో మాత్రమే టాప్‌లో కొనసాగడం కాదు.. ఇంకా ఇతర అంశాల్లోనూ అగ్రస్థానంలో ఉంది. తాజా రికార్డులతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3 రకాలుగా... ఆదాయం, లాభం, మార్కెట్‌ విలువ పరంగా మెరుగైన స్థానంలో ఉంటూ, దేశంలో నెంబర్‌ 1గా ప్రత్యేకతను చాటుకుంది.

ఏడాదికేడాది పెరుగుతున్నలాభాలు

ఏడాదికేడాది పెరుగుతున్నలాభాలు

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐఓసీతో పోలిస్తే రిలయన్స్‌ లాభం రెట్టింపు కంటే అధికంగా నమోదైంది. ఐఓసీ లాభం రూ.17,274 కోట్లు కాగా.. ఆర్‌ఐఎల్‌ లాభం రూ.39,588 కోట్లకు ఎగబాకింది. ఆదాయం, లాభంతో పాటు మార్కెట్‌ విలువపరంగా చూసినా రిలయన్సే నంబర్‌ వన్‌. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8.49 లక్షల కోట్లుగా నమోదైంది.

పదేళ్లలో భారీగా విస్తరించిన వ్యాపారం

పదేళ్లలో భారీగా విస్తరించిన వ్యాపారం

దశాబ్దం క్రితం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. ఐఓసీతో వ్యాపార పరిమాణంలో సగం మాత్రమే ఉండేది. అయితే, టెలికాం, రిటైల్‌, డిజిటల్‌ సేవల వంటి కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యాపారం గడిచిన పదేళ్లలో అనూహ్యంగా పెరిగింది. వ్యాపారంతో పాటే ఆదాయ, లాభాలూ, స్టాక్‌ మార్కెట్లో కంపెనీ విలువ గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.1.33 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలున్నాయి. స్థూల రుణ భారం రూ.2.87 లక్షల కోట్లుగా ఉంది.

 రిలయన్స్ రీటైల్ ఆన్‌లైన్‌ మార్కెట్లోకి ఎంట్రీ

రిలయన్స్ రీటైల్ ఆన్‌లైన్‌ మార్కెట్లోకి ఎంట్రీ

ఈ ఊపులోనే కంపెనీ మరిన్ని నిర్ణయాలను తీసుకోనుంది. రిలయన్స్ రీటైల్ ఆన్‌లైన్‌ మార్కెట్లో కూడా సంచలనాలను నమోదు చేయనుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రిటెయిల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా అమెజాన్‌, వాల్మార్ట్‌- ఫ్లిప్‌కార్ట్‌లకు పెద్ద సవాల్‌ విసరనుంది. వచ్చి రావడంతోనే జియో తరహాలోనే రీటెయిల్ మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లకు తెరతీయనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్ రిటైల్ సేల్స్

వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్ రిటైల్ సేల్స్

ప్రపంచ మార్కెట్ పరిశోధనా సంస్థ ఫోర్రెస్టర్ ప్రకారం 2023 నాటికి భారతదేశంలో ఆన్‌లైన్‌ రిటైల్ విక్రయాల మార్కెట్ విలువ 85 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 5,90,000 కోట్లు) టచ్‌ చేయనుంది. వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్ రిటైల్ సేల్స్ 25.8శాతం వృద్ధిని సాధించనున్నాయి.

500మిలియన్ల కస్టమర్లు

500మిలియన్ల కస్టమర్లు

అలాగే భారత్‌లో 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు, గత డిసెంబర్‌లో ఈ కామర్స్ పాలసీలో మార్పుల రూపంలో ఒడిదుడుకులు ఎదురైనా వృద్ధి కొనసాగుతుందని ఫోర్రెస్టర్ సంస్థ అంచనా వేసింది. 6,600 నగరాలు, పట్టణాల్లో 10,415 స్టోర్లు కలిగిన రిలయన్స్ రిటైల్కు ఇప్పుడు 500మిలియన్ల కస్టమర్లు ఉన్నారు.

Best Mobiles in India

English summary
Reliance topples IOC to become the biggest Indian company

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X