మరిన్ని ఉచిత ఆఫర్లకు సై..

Written By:

టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ నుంచి జియోకి మరో పెద్ద ఊరట లభించింది. ఇకపై ఎన్నిరోజులైనా జియో ఉచిత ఆఫర్లలో మార్కెట్‌లో సంచలనాలు సృష్టించవచ్చు. టెలికాం దిగ్గజాలు కోరుతున్న మినిమమ్‌ ఫ్లోర్‌ ప్రైస్‌'పై ట్రాయ్ తన నిర్ణయాన్ని తేల్చేసింది.

ఈ ఫోన్ ధర రూ. 35,300, మరి ఫీచర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెలికాం దిగ్గజాలకు మరో షాక్‌

టెలికాం సర్వీసులకు ఇప్పుడేమీ ఫ్లోర్‌ ప్రైస్‌ను అవసరం లేదని ట్రాయ్‌ చెప్పడంతో టెలికాం దిగ్గజాలకు మరో షాక్‌ ఎదురైనట్టైంది. మినిమమ్‌ ఫ్లోర్‌ ధరలతో జియో ఉచిత ఆఫర్లకు చెక్‌ పెట్టాలని ఈ కంపెనీలు భావించిన సంగతి తెలిసిందే

ఈ ధరలేమీ

ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ, అన్ని టెలికాం ప్రొవైడర్ల ప్రతినిధులతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. ఫ్లోర్‌ ప్రైస్‌ నిర్ణయించాలనేది సరియైన ఆలోచన కాదని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఈ ధరలేమీ అవసరం లేదన్నారు.

మరోసారి చర్చించేది లేదని

ఇక దీనిపై మరోసారి చర్చించేది లేదని కూడా చెప్పేశారు. డేటా ,వాయిస్ కాల్స్ రెండింటికీ కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించాలని కోరుతూ కొన్ని టెలికాం ఆపరేటర్లు ట్రాయ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మినిమమ్‌ ఫ్లోర్‌ ధరను నిర్ణయిస్తే

ఒకవేళ మినిమమ్‌ ఫ్లోర్‌ ధరను నిర్ణయిస్తే, మార్కెట్‌లో ఉచిత ఆఫర్లకు కళ్లెం పడుతోంది. ప్రస్తుతం రిలయన్స్‌ జియో ఉచిత ఆఫర్లలో టెలికాం కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

ఐడియా దాదాపు గంటపాటు ప్రజెంటేషన్‌

ట్రాయ్‌ చైర్మన్‌ నిర్వహించిన సమావేశంలో మినిమమ్‌ ఫ్లోర్‌ ప్రైస్‌ నిర్ణయించాలనే దానిపై ఐడియా దాదాపు గంటపాటు ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అయినప్పటికీ ట్రాయ్‌ ఈ విషయంపై సముఖత వ్యక్తంచేయలేదు. ఇప్పట్లో ఈ ధరలు అవసరం లేదనే పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Relief for Jio as TRAI Says No Floor Price Necessary as of Now Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot