ఆన్‌లైన్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేయడం ఎలా?

|

మీ డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యూవల్ చేయడానికి మీరు ఇకపై RTO కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. కొత్తవారు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడం నుండి మీ ప్రస్తుత డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యూవల్ చేయడం వరకు అన్ని డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చేసుకోవడానికి వీలు ఉంది. మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆన్‌లైన్ ద్వారా రెన్యూవల్ చేయడానికి భారత ప్రభుత్వం ఇప్పుడు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఫారమ్‌లో వివరాలను పూరించే ప్రయత్నాలను ఆదా చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఒక ఆధార్ eKYC కూడా ఉంది. మీరు ఆన్‌లైన్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ని ఎలా రెన్యూవల్ చేయాలి అని ఆలోచిస్తుంటే కనుక కింద గల గైడ్‌ని అనుసరించడం.

Renew Your Driving License Through Online Step by Step

ఆన్‌లైన్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసే విధానం

స్టెప్ 1. పరివాహన్ బోర్డు https://parivahan.gov.in/parivahan/ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2. ఎడమ వైపున మెను విభాగంలో ఉన్న "అప్లై ఆన్‌లైన్‌" ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 3. తరువాత "డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు" ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 4. సర్వీసును తీసుకోవాల్సిన రాష్ట్రాన్ని ఎంచుకోండి.

స్టెప్ 5. మీరు ఇప్పుడు కొత్త పేజీకి మళ్లించబడతారు.

స్టెప్ 6. ఆన్‌లైన్ దరఖాస్తుపై క్లిక్ చేసి, ఆపై డ్రైవింగ్ లైసెన్స్‌లో సేవలను ఎంచుకోండి.

Renew Your Driving License Through Online Step by Step

స్టెప్ 7. మీ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా రెన్యూవల్ చేయాలో మీకు సూచనలు అందుతాయి. ముందుకు కొనసాగే ముందు వాటిని పూర్తిగా చదవండి. మీరు పూర్తి చేసిన తర్వాత 'నెక్స్ట్' ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 8. మీ పుట్టిన తేదీ మరియు ప్రస్తుత లైసెన్స్ నంబర్, పిన్‌కోడ్ మరియు ఇతర వివరాలను నమోదు చేయండి.

స్టెప్ 9. మీరు ఇప్పుడు "అవసరమైన సర్వీసెస్" ను చూడవచ్చు. ఇది మీ ప్రస్తుత డ్రైవింగ్ లైసెన్స్‌కు వర్తించే సేవలను మాత్రమే ప్రదర్శిస్తుంది. మీరు ఇచ్చిన ఎంపికల నుండి "రెన్యూవల్" ని ఎంచుకోవాలి.

స్టెప్ 10. ఫారమ్‌లో ఇచ్చిన ఇతర సంబంధిత వ్యక్తిగత మరియు/లేదా వాహన సంబంధిత వివరాలను మీరు పూరించాల్సి ఉంటుంది.

స్టెప్ 11. మీ ఫోటో మరియు సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. గుర్తుంచుకోండి ఈ ఫీచర్ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

స్టెప్ 12. మీ మెడికల్ సర్టిఫికెట్‌లో మార్పులు ఉంటే మీ టెస్ట్ కోసం స్లాట్ బుక్ చేయండి.

స్టెప్ 13. మీరు ఈ దశలన్నింటినీ అనుసరించిన తర్వాత మీరు మీ దరఖాస్తు ID ని చూడగలిగే రసీదు పేజీకి మళ్ళించబడతారు. తరువాత మీరు అన్ని వివరాలతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS కూడా అందుకుంటారు.

స్టెప్ 14. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం చెల్లించాల్సిన మొత్తం ₹ 200. నెట్ బ్యాంకింగ్/డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయండి.

Best Mobiles in India

English summary
Renew Your Driving License Through Online Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X