మళ్లీ విమానంలో పేలిన సామ్‌సంగ్ ఫోన్, కంపెనీకి కోలుకోలేని దెబ్బ?

|

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ మరోసారి విమానంలో పేలినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను సేఫ్ అని సామ్‌సంగ్ ధృవీకరించిన తరువాత కూడా ఇలా జరగటమనేది పలు అనుమానాలకు తావిస్తోంది.

మళ్లీ విమానంలో పేలిన సామ్‌సంగ్ ఫోన్, కంపెనీకి కోలుకోలేని దెబ్బ?

Read More : చైనాలో ప్రారంభమైన 5జీ..?

లూయిస్విల్ నుంచి బాల్టిమోర్ మధ్య ప్రయాణిస్తోన్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 994లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ నుంచి పొగ వెలువుడటాన్ని గుర్తించి సిబ్బంది వెంటనే ఆ విమానాన్ని ఖాళీ చేయించి, పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమచారం. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు నమోదు కాలేదని ఓ ప్రముఖ వెబ్‌సైట్ వెల్లడించింది.

 సెప్టంబర్ 21న కొనుగోలు చేసిన ఫోన్ అది..

సెప్టంబర్ 21న కొనుగోలు చేసిన ఫోన్ అది..

ప్రమాదానికి గురైన తన గెలాక్సీ నోట్ 7 ఫోన్‌ను సెప్టంబర్ 21న కొనుగోలు చేసినట్లు ఆ ఫోన్ యజమాని తెలిపారు. ఫోన్ రిటైల్ బాక్స్ పై బ్లాక్ స్క్వేర్ సింబల్ ఉందని, అందుకే అది సేఫ్ యూనిట్‌గా భావించి కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.

దట్టమైన బూడిద-ఆకుపచ్చ రంగు పొగ

దట్టమైన బూడిద-ఆకుపచ్చ రంగు పొగ

ఫోన్ 80శాతం ఛార్జ్ అయిన తరువాత, విమాన సిబ్బంది సూచనల ప్రకారం ఛార్జింగ్‌ను ఆఫ్ చేసి ఫోన్‌ను జేబులో పెట్టుకున్నానని, ఇలా పెట్టుకున్న వెంటనే ఫోన్ నుంచి దట్టమైన బూడిద-ఆకుపచ్చ రంగు పొగ రావటాన్ని గుర్తించి ఫ్లోర్ పై పడేసానని ఆయన తెలిపారు.

 వేడి తీవ్రతకు ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లోర్ కార్పెట్స్

వేడి తీవ్రతకు ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లోర్ కార్పెట్స్

ఫోన్ నుంచి వెలువడిన వేడి తీవ్రతకు ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లోర్ కార్పెట్స్ స్వల్పంగా ధ్వంసమైనట్లు తనతో ప్రయాణించిన తోటి ప్రయాణికుడు ఒకరు తెలిపారని ఆయన వెర్జ్ మీడియాకు తెలిపారు.

ప్రస్తుతానికి తామేమి చెప్పలేమని

ప్రస్తుతానికి తామేమి చెప్పలేమని

ఈ ఘటన పై స్పందించిన సామ్‌సంగ్ ప్రస్తుతానికి తామేమి చెప్పలేమని, ఆ ఫోన్‌ను రికవర్ చేసుకుని పూర్తిగా పరిశీలించిన తరువాతనే ఏదైనా మాట్లాడగలమని సామ్‌సంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కోలుకోలేని దెబ్బ..?

కోలుకోలేని దెబ్బ..?

ఈ ఘటన సామ్‌సంగ్‌కు పెద్ద కోలుకోలేని దెబ్బగా చెప్పాలి. తన గెలాక్సీ నోట్ 7 ఫోన్‌లలో బ్యాటరీలు పేలుతోన్న సంఘటనలతో షాకైన సామ్ సంగ్ ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల ఫోన్‌లను రీకాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ లోపాలను సవరించి కొత్త గెలాక్సీ నోట్ ఫోన్‌లను సామ్ సంగ్ అందుబాటులో ఉంచింది.

 39 పేలిన కేసులు ..

39 పేలిన కేసులు ..

సామ్‌సంగ్  గెలాక్సీ నోట్ 7కు సంబంధించి ఇప్పటివరకూ 39 పేలిన కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 కొనుగోలు చేసిన వారికి ముందస్తు జాగ్రత్తాలు జారీ చేసింది.

సమస్యను సవరించినప్పటకి..

సమస్యను సవరించినప్పటకి..

బ్యాటరీ సమస్యను సవరించినప్పటకి గెలాక్సీ నోట్ 7 ఫోన్‌లు పేలుడుకు గురవటం సామ్‌సంగ్‌కు కంటిమీద కునుకులేకుంగా చేస్తోంది.

Best Mobiles in India

English summary
Replacement Samsung Galaxy Note 7 phone catches fire onboard an aircraft. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X