Video OTTలో ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న భారత్

Video OTT..క్లుప్తంగా చెప్పాలంటే వీడియో ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ).. ఇది ఇండియాలో ఇప్పుడు ప్రాధమిక దశలో ఉంది. అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ మార్కెట్లో ఇండియా నంబర్ వన్ స్థానానికి వచ్చే అవకాశాలు

|

Video OTT..క్లుప్తంగా చెప్పాలంటే వీడియో ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ).. ఇది ఇండియాలో ఇప్పుడు ప్రాధమిక దశలో ఉంది. అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ మార్కెట్లో ఇండియా నంబర్ వన్ స్థానానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీడియో ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ)లో 2022 నాటికి అంతర్జాతీయంగా టాప్‌ 10 మార్కెట్లలో ఒకటిగా రానుందని పరిశ్రమల సమాఖ్య అసోచాం, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయన నివేదికలో తేలింది. 2022 నాటికి భారత వీడియో ఓటీటీ మార్కెట్‌ పరిమాణం 823 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 5,363 కోట్లు) చేరనుందని నివేదికలో తెలిపింది. 2017–2022 మధ్య కాలంలో ఈ మార్కెట్‌ వార్షిక ప్రాతిపదికన 22.6% వృద్ధి నమోదు చేయనుంది.

 
Video OTTలో ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న భారత్

ఇదే వ్యవధిలో 10.1 శాతం వృద్ధితో అంతర్జాతీయ వీడియో ఓటీటీ మార్కెట్లకు సంబంధించి టాప్‌ 10లో ఒకటిగా నిలుస్తుందని నివేదిక పేర్కొంది. దేశీయంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ఓటీటీ సేవలు అందిస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగం

స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగం

టారిఫ్‌లు భారీగా తగ్గిపోవడం, స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగం పెరుగుతుండటంతో ప్రధానంగా వీడియో ఆన్‌ డిమాండ్‌ (వీవోడీ) మార్కెట్‌కు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని పరిశ్రమల సమాఖ్య అసోచాం, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది.
2022 నాటికి స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య 12.9% వార్షిక వృద్ధి రేటుతో 85.9 కోట్లకు చేరుతుందనేది నివేదిక అంచనా. 2017లో వీరి సంఖ్య 46.8 కోట్లుగా ఉంది.2017-2022 మధ్య కాలంలో భారత టెలివిజన్‌ పరిశ్రమ 10.6 శాతం వార్షిక వృద్ధితో 13.3 బిలియన్‌ డాలర్ల నుంచి 22 బిలియన్‌ డాలర్లకు చెందుతుందని నివేదిక పేర్కొంది.

 

 

ఆన్‌లైన్‌ వీడియోలను వీక్షించేందుకు

ఆన్‌లైన్‌ వీడియోలను వీక్షించేందుకు

భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతుండటంతో ఈ మార్కెట్ పుంజుకుంటోందని అందులో భాగంగానే ఆన్‌లైన్‌ వీడియోలను వీక్షించేందుకు అనువైన డివైజ్‌లను కంపెనీలు విపరీతంగా మార్కెట్లోకి తీసుకువస్తున్నాయని తద్వారా వీవోడీ పరిశ్రమ పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది.

ట్యాబ్లెట్స్‌ కూడా
 

ట్యాబ్లెట్స్‌ కూడా

స్మార్ట్‌ ఫోన్స్‌ కాకుండా ట్యాబ్లెట్స్‌ కూడా వీవోడీ పరిశ్రమ పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్స్‌తో పోలిస్తే హెచ్‌డీ కంటెంట్‌ చూడటానికి ట్యాబ్లెట్స్‌ అనువుగా ఉంటాయని అసోచాం-పీడబ్ల్యూసీ అధ్యయనం తెలిపింది. వినోద, మీడియా పరిశ్రమలో టీవీ అతి పెద్ద ప్రధాన విభాగమని, భవిష్యత్‌లోనూ అది అలాగే కొనసాగుతుందని వివరించింది.

ఆన్‌లైన్‌ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 50 కోట్లకు

ఆన్‌లైన్‌ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 50 కోట్లకు

ఇదిలా ఉంటే 2020 నాటికి భారత్‌లో ఆన్‌లైన్‌ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 50 కోట్లకు చేరుతుందని టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఒక నివేదికలో వెల్లడించింది. భారతీయ వినియోగదారులు సమాచారాన్ని సేకరించుకోవడాన్ని, కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆన్‌లైన్‌ వీడియోలు గణనీయంగా మారుస్తున్నాయని వివరించింది.

పది మంది కొత్త ఇంటర్నెట్‌ యూజర్లలో

పది మంది కొత్త ఇంటర్నెట్‌ యూజర్లలో

ప్రతి పది మంది కొత్త ఇంటర్నెట్‌ యూజర్లలో తొమ్మిది మంది భారతీయ ప్రాంతీయ భాషా కంటెంట్‌ను ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్‌ వీడియో సెర్చిలో మూడింట ఒక వంతు వినోద సంబంధమైనవే అంశాలే కాగా లైఫ్‌ స్టయిల్, విద్య, వ్యాపారం వంటి అంశాలు మిగతా స్థానాన్ని ఆక్రమించాయి. కార్ల కొనుగోలు అమ్మకాలు నిర్ణయాలను కూడా ఆన్‌లైన్‌ వీడియో గణనీయంగా ప్రభావితం చేస్తోంది

సగటున నెలకు 8 జీబీ మొబైల్‌ డేటా

సగటున నెలకు 8 జీబీ మొబైల్‌ డేటా

దేశీయంగా ప్రతీ యూజరు సగటున నెలకు 8 జీబీ మొబైల్‌ డేటాను వినియోగిస్తున్నారు. అలాగే ఏటా 4 కోట్ల మంది భారతీయులు కొత్తగా ఇంటర్నెట్‌ వినియోగదారులుగా మారుతున్నారు. ఆన్‌లైన్‌ సెర్చ్ విషయంలో ప్రస్తుతం మెట్రోయేతర ప్రాంతాలు .. మెట్రో నగరాలను మించుతున్నాయి. గూగుల్‌ ప్లాట్‌ఫాంపై నమోదయ్యే బ్యాంకింగ్, ఆర్థిక, బీమా సేవలకు సంబంధించిన సమాచార సేకరణలో 61 శాతం భాగం మెట్రోయేతర ప్రాంతాల నుంచే ఉంటోందని గూగుల్ తెలిపింది.

Best Mobiles in India

English summary
Video OTT market in India to be among global top 10 by 2020; touch $823 mn: Study

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X