ఎయిర్‌టెల్‌కి మళ్లీ షాకిచ్చిన జియో

దేశీయ టెలికాం రంగంలో జియో రేపిన మంటలు ఇంకా చల్లారడం లేదు. దిగ్గజాలు జియో దెబ్బకు ఇంకా నష్టాల బాటలోనే నడుస్తున్నాయి.

|

దేశీయ టెలికాం రంగంలో జియో రేపిన మంటలు ఇంకా చల్లారడం లేదు. దిగ్గజాలు జియో దెబ్బకు ఇంకా నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో దెబ్బకు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 72% తగ్గింది. గత క్యూ3లో రూ.306 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.86 కోట్లుగా నమోదైందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. భారత్‌లో టెలికం వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉండటమే ఈ భారీ క్షీణతకు కారణమని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ(ఇండియా, దక్షిణాసియా) గోపాల్‌ విఠల్‌ తెలిపారు. కాగా ఆదాయం రూ.20,319 కోట్ల నుంచి 1 శాతం పెరిగి రూ.20,519 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.

 

జియోకి పోటీగా సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రవేశపెట్టిన BSNLజియోకి పోటీగా సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రవేశపెట్టిన BSNL

లాభాల బాటలో పేమెంట్స్‌ బ్యాంక్‌

లాభాల బాటలో పేమెంట్స్‌ బ్యాంక్‌

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కారణంగా రూ.1,017 కోట్ల అసాధారణ లాభం వచ్చిందని విఠల్‌ తెలిపారు.. దీనిని పరిగణనలోకి తీసుకోకపోతే, భారత కార్యకలాపాల నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.972 కోట్లుగా ఉన్నాయని, అన్ని టెలికం వ్యాపారాల్లో ఒక్క ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా టెలికం వ్యాపారంలో మాత్రమే నికర లాభం వృద్ధి చెందిందని తెలిపారు.

ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకే లాభాలు

ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకే లాభాలు

గత క్యూ3లో రూ.394 కోట్లుగా ఉన్న ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా నికరలాభం ఈ క్యూ3లో 40 శాతం ఎగసి రూ.552 కోట్లకు పెరిగింది. ఈ విభాగం మొత్తం ఆదాయం రూ.5,284 కోట్ల నుంచి 11% పెరిగి రూ.5,904 కోట్లకు చేరింది. డేటా వృద్ధి జోరుగా ఉండటం, ఎయిర్‌టెల్‌మనీ లావాదేవీల విలువ పెరగడం వల్ల ఆదాయం ఈ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది.

40.4 కోట్లకు ఖాతాదారులు
 

40.4 కోట్లకు ఖాతాదారులు

గత క్యూ3లో 39.4 కోట్లుగా ఉన్న మొత్తం ఖాతాదారుల సంఖ్య ఈ క్యూ3లో 40.4 కోట్లకు పెరిగిందని విఠల్‌ పేర్కొన్నారు. ఆఫ్రికా, దక్షిణాసియాల్లో నికర వినియోగదారుల సంఖ్య పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఆయన వివరించారు.

 

 

భారత మొబైల్‌ వ్యాపారం

భారత మొబైల్‌ వ్యాపారం

తీవ్రమైన పోటీ కారణంగా భారత మొబైల్‌ వ్యాపారం 4 శాతం క్షీణించిందని భారత కార్యకలాపాల ఆదాయం 2 శాతం తగ్గి రూ.14,768 కోట్లకు చేరిందని ఆయన వివరించారు.

ఎయిర్‌టెల్‌ వినియోగదారుల సంఖ్య

ఎయిర్‌టెల్‌ వినియోగదారుల సంఖ్య

ట్రాయ్‌ గణాంకాల ప్రకారం నవంబర్‌లో దేశీయంగా ఎయిర్‌టెల్‌ వినియోగదారుల సంఖ్య 34.1 కోట్లు. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం డిసెంబర్‌లో వినియోగదారుల సంఖ్య 28.42 కోట్లు. అంటే ఒక నెలలో ఎయిర్‌టెల్‌ వినియోగదారుల సంఖ్య 5.7 కోట్లు తగ్గింది.

Best Mobiles in India

English summary
Jio effect: Airtel profit slumps 72%, telco continues to lose customers More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X