Android Pపై గమ్మత్తైన నిజాలు, ఏం వంటకమో తెలుసా ?

గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఆండ్రాయడ్ ఓఎస్ లను ప్రకటిస్తూ పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటికి తినుబండరాలతో పేర్లు పెడుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది.

|

గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఆండ్రాయడ్ ఓఎస్ లను ప్రకటిస్తూ పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటికి తినుబండరాలతో పేర్లు పెడుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. ఈ ఓఎస్‌ వెర్షన్ల పేర్లు భలే వెరైటీగా కూడా ఉంటాయి. కప్‌కేక్‌, డోనట్‌, ఎక్లేర్‌, ఫ్రోయో, జింజర్‌ బ్రెడ్‌, హనీ కోంబ్‌, ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌, జెల్లీబీన్‌, కిట్‌క్యాట్‌, లాలీపాప్‌, మార్షమలో, నౌగట్‌ పేర్లతో వీటిని ఇప్పటిదాకామ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కొత్తగా ఓరియో పేరుతో ఆండ్రాయిడ్ ఓఎస్ అందుబాటులో ఉంది. త్వరలో పీ పేరుతో మరో వెర్షన్ రానుందని తెలుస్తోంది. అయితే ఈ పీపై కొన్ని గమ్మత్తైన నిజాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా వాట్సప్‌లో ఫేక్ మెసేజ్‌లను అరికట్టండిఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా వాట్సప్‌లో ఫేక్ మెసేజ్‌లను అరికట్టండి

గూగుల్ ఆండ్రాయిడ్‌ పి పేరుతో..

గూగుల్ ఆండ్రాయిడ్‌ పి పేరుతో..

ప్రస్తుతం గూగుల్ లేటెస్ట్ ఓఎస్ ఆండ్రాయిడ్ ఓరియో అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా గూగుల్ ఆండ్రాయిడ్‌ పి పేరుతో త్వరలో కొత్త ఓఎస్‌ని విడుదల చేయనుంది.

గూగుల్‌ విస్తృతంగా పరీక్షలు..

గూగుల్‌ విస్తృతంగా పరీక్షలు..

ఇప్పటికే గూగుల్ దీని ఫీచర్లను, ఇతర వివరాలను వెల్లడించింది. కాగా ప్రస్తుతం బీటాను టెస్టు చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆండ్రాయిడ్‌' పి అంటే ఏంటని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనిపై గూగుల్‌ విస్తృతంగా పరీక్షలు జరుపుతోంది.

ఆండ్రాయిడ్‌ పి అంటే..

ఆండ్రాయిడ్‌ పి అంటే..

ఇప్పటివరకూ ఆండ్రాయిడ్‌ పి అంటే పీనట్‌ బటర్‌, పాన్‌కేక్‌ అనే పేర్లు వినిపించాయి. కానీ, అనుకోకుండా హువావే పాలిష్‌కు చెందిన ఓ కస్టమర్‌ ప్రతినిధి ఆండ్రాయిడ్‌ పి పేరు బయటపెట్టాడట.

హువావే పీ9 లైట్‌ మినీకి

హువావే పీ9 లైట్‌ మినీకి

హువావే పీ9 లైట్‌ మినీకి ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0 అప్‌డేషన్‌ గురించి ఓ వినియోగదారుడు ఫోన్‌ చేయగా, హువావే కస్టమర్‌ ప్రతినిధి ఆండ్రాయిడ్‌ ‘పి'ని కోట్‌ చేస్తూ ‘ఆండ్రాయిడ్‌ పిస్తాచియో' అని చెప్పేశాడు.

ఆండ్రాయిడ్‌ పిస్తా ఐస్‌క్రీమ్‌

ఆండ్రాయిడ్‌ పిస్తా ఐస్‌క్రీమ్‌

దీంతో ఈ పీ అంటే ఏంటనేది లీకయినట్లుగా తెలుస్తోంది. దీనిని ఆండ్రాయిడ్‌ పిస్తా ఐస్‌క్రీమ్‌గా పిలిచే అవకాశం ఉందని అంటున్నారు.

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక..

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక..

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ఇదే పేరును వెల్లడించడం గమనార్హం.

 కొత్త టూల్స్‌

కొత్త టూల్స్‌

కొత్త ఎమోజీలు, సెట్టింగ్‌ల్లో మార్పులు, ప్రతి ఐకాన్‌కూ ప్రత్యేక రంగు, సరికొత్త నోటిఫికేషన్‌ బార్‌, స్టికర్స్‌, మెస్సేజింగ్‌ యాప్‌లో జోడించిన కొత్త టూల్స్‌ ద్వారా సమాధానాలను మరింత వేగంగా ఇవ్వడం ఇలా ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.అంతేకాదు, బ్యాటరీ జీవితకాలం కూడా పెరుగుతుందని గూగుల్‌ చెబుతోంది.

కొందరు నెటిజన్లు

కొందరు నెటిజన్లు

అయితే ‘‘ఆండ్రాయిడ్‌ పి' అంటే ‘పిస్తా' అనే ఎందుకు అనుకోవాలి'' అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.పైనాపిల్‌ కేక్‌, పాయసం అని కూడా అనుకోవచ్చు కదా! అని మరి కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

గూగుల్ నుంచి క్లారిటీ వచ్చేంతవరకు..

గూగుల్ నుంచి క్లారిటీ వచ్చేంతవరకు..

మొత్తం మీద గూగుల్ పీ అంటే ఏంటనేది గూగుల్ నుంచి క్లారిటీ వచ్చేంతవరకు ఎవరికీ తెలియదు. రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

Android P, మీకు తెలియని కొత్త ఫీచర్లు తెలుసుకోండి

Android P, మీకు తెలియని కొత్త ఫీచర్లు తెలుసుకోండి

Android P, మీకు తెలియని కొత్త ఫీచర్లు తెలుసుకోండిAndroid P, మీకు తెలియని కొత్త ఫీచర్లు తెలుసుకోండి

Best Mobiles in India

English summary
Reports indicate that Android P might be named...wait for it...Pistachio? more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X