Republic day 2025 రిపబ్లిక్ డే పరేడ్‌ను నేరుగా చూడాలనుకుంటున్నారా.. టికెట్లను ఇలా సులభంగా పొందవచ్చు..!!
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలను ప్రతి సంవత్సరం (Republic Day 2025 Event) ఘనంగా నిర్వహిస్తోన్నారు. ఈ సంవత్సరం కూడా వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు అనగానే పరేడ్ చాలా మందికి గుర్తొస్తుంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో పరేడ్ జరుగుతుంది. ఈ పరేడ్‌ను చూసేందుకు సామాన్య ప్రజలకు కూడా అనుమతి ఉంటుంది. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా టికెట్లను కలిగి ఉండాలి.
జనవరి 26 న రిపబ్లిక్ డే పరేడ్ (Republic Day Parade Event Ticket Booking) జరగనుండగా.. 28 మరియు 29 తేదీల్లో బీటింగ్ రీట్రీట్ ను (Beating Retreat Tickets) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు రకాల టెకెట్లను భారత రక్షణ మంత్రిత్వ శాఖ (Defence ministry) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టికెట్లు ఇవాళ్టి నుంచి జనవరి 11 వరకు అందుబాటులో ఉంటాయి.

టికెట్ల ధరల వివరాలు :
రిపబ్లిక్ డే పరేడ్ కోసం రూ.100 రూ.20 విలువైన టికెట్లను అందుబాటులో ఉన్నాయి. అదే బీటింగ్ రీట్రీట్ రిహార్సల్ కోసం రూ.20 మరియు బీటింగ్ రీట్రీట్ వేడుకను చూసేందుకు రూ.100 టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మరియు ఢిల్లీ లో ఏర్పాటు చేసిన కౌంటర్ లలో ఆఫ్‌లైన్ టికెట్లను పొందవచ్చు.
ఆన్‌లైన్ బుకింగ్ కోసం : ఆన్‌లైన్ లో వెబ్‌సైట్, యాప్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. www.aamantran.mod.gov.in వెబ్‌సైట్ కు వెళ్లాలి. అనంతరం రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ రీట్రీట్ వేడుకల్లో మీకు కావాల్సిన ఈవెంట్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీ గుర్తింపు కార్డు వివరాలు, ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మీకు కావాల్సిన సీట్లను ఎంచుకొని, పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
Tickets for the #RepublicDayParade (January 26) & #BeatingRetreat (Jan 28 & 29) go on sale from Jan 02, 2025. Available online via Aamantran Portal (https://t.co/IWK0rkcp4i) & app, or at designated counters across Delhi. Prices: ₹20–₹100. Bring ID for entry.
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) January 1, 2025
Details:… pic.twitter.com/d8jhqll51D
యాప్ ద్వారా టికెట్ల ను బుకింగ్ చేసుకొనేందుకు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ నుంచి Aamantran యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న అనంతరం మీకు కావాల్సిన ఈవెంట్ ను ఎంచుకోవాలి. మీకు కావాల్సిన సీట్లను ఎంపిక చేసుకొని, ఆన్‌లైన్ లోనే పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.
ఆఫ్‌లైన్ బుకింగ్ వివరాలు : రిపబ్లిక్ డే, బీటింగ్ రీట్రీట్ వేడుకల ఆఫ్‌లైన్ టికెట్ల కోసం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. సేనా భవన్ (గేట్ నంబర్ 2), శాస్త్రి భవన్ (న్యూ గేట్ నంబర్ 3), జంతర్ మంతర్ (మెయిన్ గేట్ సమీపంలో), ప్రగతి మైదాన్ (గేట్ నంబర్ 1), రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ (గేట్ నంబర్ 7, 8) ప్రాంతాల్లో టికెట్ల బుకింగ్ కేంద్రాలున్నాయి.
ఈ కేంద్రాల్లో ఒరిజినల్ గుర్తింపు కార్డుతో ఉదయం 10:00 AM నుంచి మధ్యాహ్నం 1: 00 PM, మధ్యాహ్నం 2:00 PM నుంచి 4:00 PM వరకు టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. అనంతరం అక్కడే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఈ నెల 26, 28 మరియు 29 తేదీల్లో జరగనున్నాయి.


Click it and Unblock the Notifications








