మొబైల్ గేమర్స్ ఏ నగరంలో ఎక్కువగా ఉన్నారో తెలుసా????

|

కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇండియాలో లాక్ డౌన్ దాదాపుగా నాలుగు నెలల పాటు విధించారు. ఇప్పటికి చాలా సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుండి పనిచేయడానికి ఆదేశాలను అనుసరిస్తున్నది. ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించడం జరిగింది. అందులోను మొబైల్ గేమ్స్ వినియోగం అధికం అయింది. మొబైల్ గేమర్స్ పరంగా అహ్మదాబాద్ భారతదేశంలో అగ్రస్థానంలో ఉందని ఓపెన్‌సిగ్నల్ అధ్యయనం తెలిపింది.

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారుల సంఖ్య

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారుల సంఖ్య

మొబైల్ అనలిటిక్స్ సంస్థ ఇటీవల చేసిన సర్వేలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారుల సంఖ్యను బట్టి మొబైల్ గేమింగ్ కోసం భారతదేశంలోని అగ్ర నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ సర్వేలో అహ్మదాబాద్ మొదటి స్థానంలో ఉండగా నవీ ముంబై మరియు వడోదర వరుసగా రెండవ మరియు మూడవ ర్యాంకులలో ఉన్నాయి. దేశంలోని టాప్ 10లోని టైర్1 నగరాలలో అహ్మదాబాద్ మరియు ముంబై మాత్రమే ఉండడం గమనార్హం. సరసమైన స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం ఇండియా మార్కెట్ లోకి చొచ్చుకురావడంతో పాటుగా తక్కువ-ధర వద్ద డేటా లభించడం మరియు దేశంలో బ్యాండ్‌విడ్త్‌ మెరుగవడం వలన టైర్ 2 మరియు టైర్ 3 నగరాలు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి అని ఓపెన్‌సిగ్నల్ సంస్థ తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సెల్యులార్ నెట్‌వర్క్‌లలో రియల్ టైమ్ మల్టీప్లేయర్ మొబైల్ గేమింగ్‌ అనుభవం

సెల్యులార్ నెట్‌వర్క్‌లలో రియల్ టైమ్ మల్టీప్లేయర్ మొబైల్ గేమింగ్‌ అనుభవం

మొబైల్ అనలిటిక్స్ సంస్థ భారతదేశంలోని అతిపెద్ద 48 నగరాల్లో మొబైల్ నెట్‌వర్క్ అనుభవాన్ని ఓపెన్‌సిగ్నల్ ద్వారా విశ్లేషించిన తరువాత ఈ జాబితాను విడుదల చేసింది. 0-100 స్కేల్‌లో స్కోర్ చేయబడిన ఈ జాబితా "యూజర్లు సెల్యులార్ నెట్‌వర్క్‌లలో రియల్ టైమ్ మల్టీప్లేయర్ మొబైల్ గేమింగ్‌ను ఎలా గ్రహిస్తారో" తెలుపుతుంది. కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్, PUBG మొబైల్ మరియు క్లాష్ రాయల్ వంటి ప్రసిద్ధ మల్టీప్లేయర్ బాటిల్ గేమ్ లను ఈ అధ్యయనంలో ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నారు.

Also Read:Amazon అమ్మకంలో ల్యాప్‌టాప్‌లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్!! త్వరపడండి...Also Read:Amazon అమ్మకంలో ల్యాప్‌టాప్‌లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్!! త్వరపడండి...

స్మార్ట్‌ఫోన్‌ గేమింగ్ అనుభవంలో నగరాల స్థానాల వివరాలు

స్మార్ట్‌ఫోన్‌ గేమింగ్ అనుభవంలో నగరాల స్థానాల వివరాలు

71.7 స్కోరుతో అహ్మదాబాద్ అగ్రస్థానంలో ఉండగా ఇతర టాప్ 10 నగరాల్లోని నవీ ముంబై (70.1), వడోదర (69.8), సూరత్ (68), భోపాల్ (67.8), ముంబై (67.8), గ్వాలియర్ (67.7), ఇండోర్ ( 67.7), థానే (65.7), రాజ్‌కోట్ (64.3) మరియు తిరువనంతపురం 47.9 పాయింట్లతో ఉన్నాయి. టైర్1 నగరాలలోని మొబైల్ గేమింగ్ యూజర్ల  స్కోర్ల వివరాలు చెన్నై (63.6), హైదరాబాద్ (63.1), పూణే (61.5), బెంగళూరు (61.3), ఢిల్లీ (59.8), కోల్‌కతా (57.2) పాయింట్లతో తరువాత స్థానాలలో ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లలో గేమింగ్ అనుభవాన్ని కొలిచే విధానం

స్మార్ట్‌ఫోన్‌లలో గేమింగ్ అనుభవాన్ని కొలిచే విధానం

స్మార్ట్‌ఫోన్‌లలో గేమింగ్ అనుభవాన్ని యూజర్ యొక్క డేటాగ్రామ్ ప్రోటోకాల్ (UDP) లాటెన్సీ, ప్యాకెట్ లాస్ మరియు జిట్టర్ అనే మూడు ముఖ్య అంశాలపై ఆధారపడి ఉంటుందని అధ్యయనం పేర్కొంది. UDP లాటెన్సీ లేదా ప్యాకెట్ లాస్ వంటివి గేమింగ్ యొక్క నిజసమయంలో సున్నితమైన యాప్ ల కోసం నెట్‌వర్క్ కనెక్షన్ యొక్క ప్రతిస్పందనను కొలుస్తుంది. ప్యాకెట్ లాస్ అనేది యూజర్ల  గమ్యాన్ని చేరుకోని డేటా ప్యాకెట్ల మొత్తాన్ని సూచిస్తుంది. డేటా ప్యాకెట్ల రాక సమయం యొక్క వైవిధ్యాన్ని జిట్టర్ చూపిస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Research Report: Ahmedabad Cities Tops in Mobile Gaming

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X