Aliens రేడియా సిగ్నల్స్ ను అందుకున్న పరిశోధకులు
భూమి అనేది కొన్ని సంవత్సరాలలో అంతం అవుతుంది అని చాలానే ప్రచారం జరిగాయి. మానవాళి మనుగడ కోసం మరొక గ్రాహం కోసం కూడా చాలా సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నారు. అలాగే అంతరిక్షంలో గ్రహాంతర వాసుల(Aliens) కూడా ఉన్నారు అని చాలా మంది భావిస్తున్నారు. దీనికి నిదర్శనగా చాలానే సినిమాలను కూడా తీసి విడుదల చేసి ప్రజల మనసులలో గ్రహాంతర వాసులు ఉన్నారు అన్న భ్రమను కూడా కలిగించారు.

అంతరిక్షంలోకి చాలా రోజుల నుంచి కొన్ని రకాల సిగ్నల్స్ ను పంపుతున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందానికి ఎట్టకేలకు మన సౌర వ్యవస్థకు మించిన గ్రహం నుండి మొదటిసారి రేడియో సిగ్నల్‌ను పొందారు. ఈ రేడియో సిగ్నల్‌ల యొక్క వివరాలలోకి వస్తే మన సౌర వ్యవస్థకు సుమారు 51 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక ఎక్స్‌ప్లానెట్ నుండి ఈ సిగ్నల్స్ లను స్వీకరించినట్లు వెల్లడించారు. నెదర్లాండ్స్‌లోని రేడియో టెలిస్కోప్ లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) ను ఉపయోగించి పరిశోధకులు టౌ బూట్స్ స్టార్-సిస్టమ్ నుండి ఈ సిగ్నల్స్ లను కనుగొన్నారు. దీనిని పరిశోధకులు బృహస్పతి పరిమాణంతో పోల్చడంతో పాటుగా సూర్యుడికి చాలా దగ్గర పోలికలు కలిగి ఉంటాయి అని భావిస్తున్నారు.

అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల నేతృత్వంలోని బృందం క్యాన్సర్ మరియు ఉప్సిలాన్ ఆండ్రోమెడే వ్యవస్థలలోని ఇతర గ్రహాల రేడియో-ఉద్గార అభ్యర్థులను కూడా పరిశీలించింది. ఏది ఏమయినప్పటికీ ఆస్ట్రానమీ & ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం టౌ బూట్స్ ఎక్సోప్లానెట్ వ్యవస్థ మాత్రమే ఈ గణనీయమైన రేడియో సంతకాన్ని ప్రదర్శించింది. "రేడియో తరంగాల సహాయంతో ఎక్సోప్లానెట్ను గుర్తించే మొదటి సూచనలలో ఒకటి మేము ప్రదర్శిస్తున్నాము" అని కార్నెల్ పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు జేక్ డి టర్నర్ తెలిపారు.

భూ అయస్కాంత క్షేత్రం అనేది సూర్యని యొక్క అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. ఒక గ్రహం నివాసయోగ్యానికి అనుకూలంగా ఉండడానికి స్పేస్ లో ఎక్సోప్లానెట్స్ భూమి లాంటి అయస్కాంత క్షేత్రంను కలిగి ఉండాలి అని చాలా మంది భావిస్తున్నారు. ఇతర గ్రహాల యొక్క వాటి సొంత వాతావరణాలను సోలార్ విండ్, విశ్వకిరణాల నుంచి రక్షించడం ద్వారా గ్రహాన్ని వాతావరణ నష్టం నుంచి రక్షించడం ద్వారా వారి నివాసానికి దోహదం చేస్తుందని టర్నర్ చెప్పారు.

రెండేళ్ల కిందట టర్నర్ మరియు అతని సహచరులు జూపిటర్ రేడియో ఎమిషన్ సిగ్నేచర్స్ ను పరిశీలించారు. సుదూరంగా ఉన్న గురుగ్రహం లాంటి ఎక్సోప్లానెట్స్ నుంచి సాధ్యమయ్యే సంకేతాలను సేకరించడంతో వీటి మీద ఒక అవగాహనకు వచ్చారు. ఈ ఫలితాల ఆధారంగా 40 నుంచి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఇతర గ్రహాల నుంచి రేడియో తరంగాలను శోధించడానికి వీలుగా మారాయి.


Click it and Unblock the Notifications








