‘ఎస్ఎంఎస్’ ఎఫెక్ట్!

Posted By: Prashanth

‘ఎస్ఎంఎస్’ ఎఫెక్ట్!

 

న్యూఢిల్లీ: ఆస్సాం అల్లర్లు నేపధ్యంలో ఎస్‌ఎంఎస్‌ల పై నియంత్రణలు విధించటం వల్ల మొబైల్ యూజర్లు ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అత్యవసర చర్య కారణంగా టెలికం ఆపరేటర్లకు ఈ నెలలో 7 నుంచి 8% మేరకు ఆదాయంలో కోతపడనుంది. సెల్యులర్ ఆపరేటర్ల అసోసియేషన్ (సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ ఈ అంచనాలను వెల్లడించారు.

ఆస్సాం అల్లర్ల నేపధ్యంలో ఆగస్టు 18 నుంచి దేశ వ్యాప్తంగా 15 రోజుల పాటు బల్క్ ఎస్ఎంఎస్ ఇంకా ఎమ్ఎమ్ఎస్‌లను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంఘవిద్రోహ శక్తులు కొన్ని వదంతులతో కూడిన సందేశాలతో ఆస్సామీలను భయబ్రాంతులకు గురిచేస్తున్న నేపధ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు హోమ్ శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ తెలిపారు. టెలికాం ఆపరేటర్లు ఈ ఆదేశాలు పాటించేలా చూడాలని టెలికాం విభాగానికి హోంశాఖ సూచించింది. కేంద్ర హోంశాఖ తాజా ఆదేశాల ప్రకారం ఒక్కో విడతకు సందేశాలైతే ఐదు, సమాచార దృశ్యాలైతే 12 కేబీలకు మించి పంపించటానికి వీలుపడదు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting