Home
News

క్రేజీ ఆఫర్... స్మార్ట్‌ఫోన్ కొంటే 2 కిలోల టమాటోలు ఉచితం..!

దేశంలో ప్రస్తుతం టమాటో ధర హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నడూ లేనంతగా ధర పెరిగింది. ఫలితంగా కొన్ని చోట్ల దొంగతనాలు సైతం జరుగుతున్నాయి. దీంతో పలు దుకాణాల్లో టమాటోలకు రక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను నియమించుకున్న పరిస్థితి కూడా ఉంది. దేశంలో ప్రజలు ఎక్కువగా వినియోగించే కూరగాయల్లో టమాటో కూడా ఒకటి.

టమాటో ధర పెరగడంతో వ్యాపారుల్లోనూ పోటీ నెలకొంది. ఒక్కసారిగా ధర పెరగడంతో డిమాండ్‌ తగ్గింది. అయితే టమాటో ధరను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఓ వ్యాపారి. వినూత్నంగా ఆలోచించి.. మధ్యప్రదేశ్‌కు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దుకాణం యాజమాని మంచి ఆఫర్‌ ఇచ్చాడు.

retailer offers 2kg tomatoes on mobile purchage

మధ్యప్రదేశ్‌కు చెందిన అభిషేక్‌ అగర్వాల్‌ అనే వ్యాపారి తన స్టోర్‌లో మొబైల్‌ కొనుగోలు చేసిన వారికి రెండు కిలోల టమాటోలు ఉచితంగా ఇస్తామని ప్రచారం చేశాడు. టమాటో ధర అధికంగా ఉన్న కారణంగా ఫోన్లు కొనుగోలు చేయాలనుకొనే వారు తన వద్దకు వస్తారని భావించాడు. వ్యాపారి అనుకున్నదే జరిగింది.

ఈ ఆఫర్‌ తనకు విజయాన్ని తెచ్చిపెట్టిందని. ఉచిత టమాటో ఆఫర్ ప్రారంభించిన నుంచి తన స్టోర్‌లో వినియోగదారుల సంఖ్య పెరిగిందని వ్యాపారి అగర్వాల్‌ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మొబైల్‌ కొనుగోలు చేసిన కస్టమర్లకు సుమారు క్వింటా టమాటోలు ఉచితంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ టమాటో ఆఫర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతుందని చెప్పారు. చాలా మంది ట్రోల్స్‌ కూడా చేస్తున్నారని పేర్కొన్నారు.

టమాటో ధర ప్రజల్ని ఎంత ప్రభావితం చేస్తుందో ఈ ఘటన చెబుతోంది. సాధారంగా ప్రతి సంవత్సరం జూన్‌, జులైలో టమాటోల ఉత్పత్తి తగ్గుతుంది. అయితే ఈసారి ధర పెరుగుదల అసాధారణంగా ఉందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. టమాటో ధర పెరిగేందుకు వాతావరణం అనుకూలించకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

2023 ప్రారంభంలో కిలో టమాటో ధర రూ.22 మాత్రమే ఉండేది. అయితే ఈ ధర ప్రస్తుతం ఐదు రెట్లకు పైగా పెరిగింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం కేరళలో టమాటో ధర రూ.100-150 ఉంది. ఢిల్లీలో రూ.100 నుంచి 150 వరకు ఉంది. చెన్నైలో సుమారుగా 110 రూపాయలు ఉంది. ఏపీ, తెలంగాణలో కూడా అధిక ధర ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో 100 రూపాయల నుంచి 150 వరకు ఉంది.

టమాటో అధిక ధర కారణంగా ప్రముఖ ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్థ మెక్‌డోనాల్డ్స్ బర్గర్‌లో టమాటోలను వినియోగించడం లేదని తెలిపింది. అయితే టమాటో ధర ప్రజలకు భారం అనిపించినా.. ఉచిత టమాటో ఆఫర్‌ మాత్రం స్మార్ట్‌ఫోన్‌ల దుకాణం యాజమానికి బాగా కలిగి వచ్చింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
retailer offers 2kg tomatoes free on smartphone purchase offer goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X