యూజర్లకు తిప్పలు,అమెజాన్ అకౌంట్లను రద్దు చేస్తోంది, కారణాలు ఇవే

|

ప్రముఖ ఈ -కామర్స్ వెబ్‌సైట్‌ అమెజాన్‌ యూజర్లకు దిమ్మతిరిగే న్యూస్ చెప్పింది. నిబంధనలను ఉల్లంఘిస్తోన్న తమ కస్టమర్ల అకౌంట్లను బ్యాన్‌ చేస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసి, అవి నచ్చకపోతే తిరిగి ఇచ్చేయొచ్చన్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే, ఈ వెసులుబాటును ఆసరాగా తీసుకుని ఒక్కోసారి ఎలాంటి కారణం లేకుండా వాటిని పదేపదే వెనక్కి ఇచ్చేస్తోన్న వారిపై అమెజాన్‌ చర్యలు తీసుకుంటోంది. చాలా కాలం నుంచి అమెజాన్‌.. ఇటువంటి కస్టమర్ల అకౌంట్లను రద్దు చేస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఈజీ ఫ్రీ రిటర్న్‌ పాలసీ వల్ల పలు సమస్యలు ఏర్పడుతోన్న నేపథ్యంలో అమెజాన్‌ కస్టమర్లను బ్యాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

 

Xiaomi 8వ వార్షికోత్సవం,అభిమానులకు 8తో అదిరిపోయే గిఫ్ట్ !Xiaomi 8వ వార్షికోత్సవం,అభిమానులకు 8తో అదిరిపోయే గిఫ్ట్ !

మొదట మెసేజ్‌

మొదట మెసేజ్‌

12 నెలల్లో పలు వస్తువులను కొనుగోలు చేసి మళ్లీ ఆ ఆర్డర్లను వెనక్కి తిరిగి ఇచ్చేసిన వారికి అమెజాన్‌ మొదట మెసేజ్‌ పంపుతోంది. అందుకు గల కారణాన్ని చెప్పాలని కూడా అడుగుతోంది. ఆ తరువాత వారి అకౌంట్‌ను రద్దు చేస్తోంది.

ముందస్తుగా ఎలాంటి నోటీసు లేకుండా

అమెజాన్‌ ముందస్తుగా ఎలాంటి నోటీసు లేకుండా తమ అకౌంట్లను క్లోజ్‌ చేసినట్టు పలువురు కస్టమర్లు ట్విటర్‌, ఫేస్‌బుక్‌ల్లో ఫిర్యాదు చేశారు. ఒక కస్టమర్‌ అయితే ఏకంగా అమెజాన్‌ నుంచి వచ్చిన ఈ-మెయిల్‌ను స్క్రీన్‌షాట్‌ తీసి షేర్‌చేసింది.గత 12 నెలల్లో ఎందుకు పలు ఆర్డర్లను వెనక్కి తిరిగి ఇచ్చేశారు, దానికి సమాధానం చెప్పండని అమెజాన్‌ అడిగినట్టు ఆ స్క్రీన్‌షాట్‌లో ఉంది.

తమ పాలసీలను ఉల్లంఘిస్తున్నందుకే
 

తమ పాలసీలను ఉల్లంఘిస్తున్నందుకే

తమ పాలసీలను ఉల్లంఘిస్తున్నందుకే యూజర్లను తమ ప్లాట్‌ఫామ్‌పై బ్యాన్‌ చేసినట్టు అమెజాన్‌ పేర్కొంటోంది. అమెజాన్‌ తన ప్లాట్‌ఫామ్‌పై యూజర్లను బ్యాన్‌ చేయడం ఇదేమీ తొలిసారి కాదని, అంతకముందు కూడా పలువురు ప్రైమ్‌ మెంబర్లను బ్యాన్‌ చేసిందని తెలిసింది.

అమెజాన్‌కు వ్యతిరేకంగా దావా

అమెజాన్‌కు వ్యతిరేకంగా దావా

అప్పుడు కూడా అమెజాన్‌ సరియైన వివరణ ఇవ్వలేదు. ఇదే విషయంపై కొంతమంది అమెజాన్‌కు వ్యతిరేకంగా దావా కూడా వేశారు. మరి మీ అకౌంట్ల విషయంలో ఓ సారి సరిచూసుకోండి.

అమెజాన్‌లో వస్తువులు కొనే ముందు శాంపిల్స్ ట్రై చేయడం ఎలా..?

అమెజాన్‌లో వస్తువులు కొనే ముందు శాంపిల్స్ ట్రై చేయడం ఎలా..?

అమెజాన్ ప్రైమ్ శాంపిల్స్ ఫ్రైమ్ మెంబర్స్ కి మాత్రమే..
మనకు నచ్చిన బ్యూటీ క్రీమ్, స్కిన్ కేర్, ఏదైనా ఫుడ్ ఐటమ్ ను ఫ్రీగా శాంపిల్ పొందడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశ్యం. సాధారణంగా కొన్ని ప్రాడెక్ట్స్ చాలా ఎక్కువ రేట్ ఉండటం లేదా మార్కెట్లోకి కొత్తగా వచ్చి ఉంటాయి. వాటిని టెస్ట్ చేయకుండా కొనాలంటే మనసు ఒప్పుకోదు.

ప్రైమ్ మెంబర్స్ కు

ప్రైమ్ మెంబర్స్ కు

అలాంటి సమయంలోనే ప్రైమ్ మెంబర్స్ కు సదరు ఖరీదైన, లేదా కొత్త ప్రాడెక్టును చాలా తక్కువ ధరలో శాంపిల్ పొందే వీలుంది. అంటే మీరు కొనాలనుకున్న ప్రాడెక్టు ధర ఓ రూ.200 వందల ఉంది అనుకుంటే దానికి సంబంధించిన శాంపిల్ మీరు 2 లేదా 3రూ.లలో దొరుకుతుంది. ఇంకేంటి ఆ శాంపిల్ తెచ్చుకొని వాడుకోవచ్చు. వాడిన అనంతరం మీకు నచ్చితే మొత్తం ప్రాడెక్టును తెప్పించుకోవచ్చు.

పూర్తి ధరతో అసలు ప్రాడక్టు కొన్నట్లయితే

పూర్తి ధరతో అసలు ప్రాడక్టు కొన్నట్లయితే

అంతేకాదు మీరు పూర్తి ధరతో అసలు ప్రాడక్టు కొన్నట్లయితే మీరు ఇంతకు ముందు కొనుగోలు చేసిన శాంపిల్ ధరను ఈ మెయిన్ ప్రాడక్టులో డిస్కౌంట్ చేస్తారు. అంటే మీరు ఫ్రీగా శాంపిల్ పొందినట్లే.. మీరు కొనుగోలు చేసిన శాంపిల్ ధరను అమెజాన్ క్రెడిట్ గా పరిగణిస్తారు.

అమెజాన్ శాంపిల్ వాడుకోండిలా ?

అమెజాన్ శాంపిల్ వాడుకోండిలా ?

- ఈ స్కీమ్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్స కు మాత్రమే లభ్యం - శాంపిల్స్ పొందిన సమయంలో షిప్పింగ్ కూడా ఉచితం, 3-5 రోజుల్లో డెలివరీ అవ్వచ్చు - మీరు ఎన్ని శాంపిల్స్ అయినా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఒకే ప్రాడెక్టువి ఒకటి కన్నా ఎక్కువ శాంపిల్స్ కొనుగోలు చేసేవీలులేదు. - మీరు కొన్న శాంపిల్స్ అమౌంట్ ను అమెజాన్ క్రెడిట్ గా పరిగణిస్తారు. - అయితే ఈ క్రెడిట్ ను 180 రోజుల్లోగా వినియోగించుకోవాలి.

ప్రస్తుతం ఎక్కువగా

ప్రస్తుతం ఎక్కువగా

ప్రస్తుతం ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్, ఆహార, పానీయాలు, పర్సనల్ కేర్ కు సంబంధించిన ఉత్పత్తుల శాంపిల్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ సౌకర్యాలను వినియోగించుకోండి..

Best Mobiles in India

English summary
Be careful how often you return your Amazon orders: It might get you banned from the service. More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X