ప్రయాణాల్లో, కరెంటు అందుబాటులో లేని సందర్భాల్లో సోలార్‌ ఛార్జర్‌

Posted By: Staff

ప్రయాణాల్లో, కరెంటు అందుబాటులో లేని సందర్భాల్లో సోలార్‌ ఛార్జర్‌

ప్రయాణాల్లో, కరెంటు అందుబాటులో లేని సందర్భాల్లో సోలార్‌ ఛార్జర్‌ ఉపయోగపడుతుంది. పేరు Solmate Fusion. ఇది యూఎస్‌బీ డ్రైవ్‌ మాదిరిగా డేటాని నిక్షిప్తం చేసుకుంటుంది. చెన్నైకి చెందిన కంపెనీ దీన్ని దేశంలో అందుబాటులోకి తెచ్చింది. 8 జీబీ, 4 జీబీ మెమొరీ సామర్థ్యంతో రూపొందించారు. ఏ కంపెనీ మొబైల్‌నైనా ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఇది సూర్యకాంతితో ఛార్జ్‌ అవ్వడానికి సుమారు 6 నుంచి 7 గంటలు పడుతుంది. సిస్టం, ల్యాప్‌టాప్‌ యూఎస్‌బీ పోర్ట్‌కి కనెక్ట్‌ చేసి 2 నుంచి 3 గంటల్లో ఛార్జ్‌ చేయవచ్చు.

ఛార్జ్‌ అయిన తర్వాత మొబైల్‌ను కనెక్ట్‌ చేసి రెండు గంటలు మాట్లాడవచ్చు. ఎంపీ3 ప్లేయర్‌లో 13 గంటలు పాటలు వినొచ్చు. సిస్టం యూఎస్‌బీ పోర్ట్‌కి కనెక్ట్‌ చేయగానే సంబంధిత డ్రైవర్‌ సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్‌అయిపోతాయి. సుమారు 3000 మొబైల్‌ మోడల్స్‌ను ఛార్జ్‌ చేసేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. 8 జీబీ సామర్థ్యంతో కూడిన సోల్మేట్‌ ధర రూ.1495. 4 జీబీ రూ.995. వివిధ మోడళ్ల అడాప్టర్‌ పిన్స్‌ని కూడా అందిస్తున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting