icc world cup 2019,ఉబర్ అదిరిపోయే కానుక

|

ఈ సమ్మర్ లో హాట్ హాట్ గా ఐపీఎల్ ముగిసింది. క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని ఐపీఎల్ కల్పించింది. ప్రతి మ్యాచ్ హోరాహోరీగా జరిగి అభిమానులను ఉరకలెత్తించింది. ముంబై ఐపీఎల్ కప్ ను ముద్దాడటంతో దీనికి తెరపడింది. అయితే ఇప్పుడు మళ్లీ క్రికెట్ అభిమానులకు మరో పండుగ వాతావరణం వస్తోంది. త్వరలో క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ మొదలు కాబోతోంది. మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లాండ్‌, వేల్స్‌లో క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది.

icc world cup 2019,ఉబర్ అదిరిపోయే కానుక

 

మరి మీరు కూడా ఈ వరల్డ్ కప్‌కు వెళ్లాలనుకుంటున్నారా? దీనికి మీకు ఉబర్ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. సింపుల్‌గా ఉబర్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినా, క్యాబ్ బుక్ చేసినా చాలు. మీరు క్రికెట్ వరల్డ్ కప్‌కు వెళ్లే ఛాన్స్ కొట్టేయొచ్చు. అదెలాగూ చూద్దాం.

మే 13నుంచి ఈ ఆఫర్ స్టార్ట్

మే 13నుంచి ఈ ఆఫర్ స్టార్ట్

ఇందుకోసం మీరు ఉబర్ కాంటెస్ట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో మీరు స్కోర్ చేస్తే చాలు... మీకు వరల్డ్ కప్ చూసే ఛాన్స్ రావొచ్చు. మే 13న ఈ ఆఫర్ ప్రారంభమైంది. మీరు ఉబర్‌ ఈట్స్, ఉబర్‌ రైడ్‌లో చేసే ప్రతీ ఆర్డర్‌పై మీకు రన్స్ వస్తాయి.

వరల్డ్ కప్ చూసే అవకాశం

వరల్డ్ కప్ చూసే అవకాశం

ఎన్ని రన్స్ ఎక్కువగా ఉంటే వరల్డ్ కప్ చూసే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు... బహుమతులు కూడా ఉంటాయి. రవాణా సంస్థ ఉబర్ ఇప్పటికే ఈ కాంటెస్ట్‌పై విరాట్ కోహ్లీతో ప్రకటనలు ఇస్తోంది.

జూలై 14న
 

జూలై 14న

ఉబర్ కాంటెస్ట్ మే 13న ప్రారంభమై జూలై 14న ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో యూజర్లు చేసే ప్రతీ ఆర్డర్‌పై వారికి రన్స్ వస్తాయి. ఎక్కువ రన్స్ సాధించినవారు వరల్డ్ కప్ ప్యాకేజీ గెలుచుకోవచ్చు. వరల్డ్ కప్ ప్యాకేజీ మ్యాచ్ టికెట్స్, ఫ్లై టికెట్స్, హోటల్ రూమ్ ఇందులో కలిపి ఉంటాయి.

ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్‌లో నోటిఫికేషన్

ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్‌లో నోటిఫికేషన్

ఉబర్ ఈట్స్‌లో రూ.100 నుంచి రూ.250 మధ్య ఆర్డర్ చేస్తే 4 రన్స్ వస్తాయి. రూ.250 దాటితే 6 రన్స్ వస్తాయి. ఇక UberAuto, UberMoto, UberPool, UberGo బుకింగ్స్‌పై 4 రన్స్, UberPremier, UberInterCity, UberXL, UberHire బుకింగ్స్‌పై 6 రన్స్ వస్తాయి. మీరు గెలుచుకున్న రన్స్‌ పెరిగితే వరల్డ్ కప్ ప్యాకేజీ గెలుచుకునే అవకాశాలు పెరుగుతాయి. గెలిచినవారికి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్‌లో నోటిఫికేషన్ వస్తుంది.

50% తగ్గింపు

50% తగ్గింపు

కాంటెస్ట్ ముగిసేలోపు 50 రన్స్ చేసినవారికి ఉబర్ రైడ్, ఉబర్ ఈట్స్‌లో ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. ఉబర్ ఈట్స్‌లో 5 ఆర్డర్స్‌కు 50% తగ్గింపు రూ.50 వరకు లభిస్తుంది. రైడ్స్‌లో 5 బుకింగ్స్‌కు 25% తగ్గింపు రూ.75 వరకు లభిస్తుంది. 50 రన్స్ పొందినవారు జూలై 14 తర్వాత ICCEATS, ICCRIDES ప్రోమో కోడ్స్ ఉపయోగించుకోవచ్చు.

మైక్రో మొబిలిటీ అంటే ఏంటి?

మైక్రో మొబిలిటీ అంటే ఏంటి?

ట్రాఫిక్ జామ్‌లతో విసిగి‌పోతున్నవాళ్లకి ఉబర్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది . ఇందుకోసం టెక్నాలజీ ఆధారిత మొబైల్ ఫ్లాట్ ఫారం ‘యులు'తో జతకట్టింది ఆ సంస్థ. బెంగుళూరులో వినియోగదారులకు ఈ-బైకులు, సైకిళ్లను అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణానికి డ్యామేజ్ కాకుండా ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకువచ్చింది. ఈ వెహికల్స్‌ మీద మెట్రో సిటీస్‌లో 20 కిలోమీటర్లు వేగం, మిగతా టౌన్లలో 25 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేయవచ్చు.

ఈ-బైక్‌లు ఎలా తీసుకోవాలి?

ఈ-బైక్‌లను అద్దెకి తీసుకునేవారు ముందుగా ఉబర్‌‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ-బైక్‌లను వినియోగించాలనుకునే వాళ్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్ సాయంతో వాటిని ఓపెన్ చేయవచ్చు. ఛార్జ్ ఎంతనేది యాప్‌లో వివరాలుంటాయి.

కొంతలోకొంత ట్రాఫిక్‌ రద్దీ

కొంతలోకొంత ట్రాఫిక్‌ రద్దీ

నిత్యం కార్లతో బిజీగా మారిన ప్రధాన సిటీల్లో ఈ తరహా విధానం వల్ల కొంతలోకొంత ట్రాఫిక్‌ రద్దీని తగ్గించవచ్చు. మరీ ముఖ్యంగా ప్రపంచంలో టాప్-10 అత్యధిక కాలుష్యమైన నగరాల్లో ఇండియాకి చెందినవి ఏడు వున్నాయి. ఈ కాన్సెప్ట్‌ని మిగతా నగరాలకు విస్తరించేపనిలో ఉబర్ నిమగ్నమైంది .

Most Read Articles
Best Mobiles in India

English summary
ride an uber to the icc world cup 2019 in england and wales

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X