RIL AGM రిలయన్స్ వార్షిక సమావేశం.. యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ముఖేష్ అంబానీ.. 100GB ఉచిత స్టోరేజీ సహా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఇవాళ వార్షిక సమావేశం (Reliance Annual General Meeting 2024) నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా ఇతర ఉత్పత్తులపై కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ఈ వార్షిక సాధారణ సమావేశాన్ని సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వ్యాపారాల కోసం AI డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించిట్లు చెప్పారు.
ప్రస్తుతం ప్రతిపనిలో (RIL AGM) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎంతో కీలకంగా ఉందని అంబానీ తెలిపారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లగ్జరీ వస్తువుగా మిగిలిపోకూడదని మరియు ప్రీమియం పరికరాలకు మాత్రమే పరిమితం కావొద్దని అంబానీ అభిప్రాయపడ్డారు. కింది స్థాయిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు.

అయితే ఈ వార్షిక సాధారణ సమావేశంలో అనేక కీలక ప్రకటనలు చేశారు. AI క్లౌడ్ స్టోరేజీ సేవలను అందించనున్నట్లు చెప్పారు. దీపావళి నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వెల్‌కమ్ ఆఫర్ కింద జియో యూజర్లకు 100GB ఉచిత స్టోరేజీ అందించనున్నట్లు తెలిపారు. వీడియోలు, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లు సహా ఇతర కంటెంట్‌ను భద్రపరచుకొనేందుకు క్లౌడ్ స్టోరేజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
జియో హోమ్ సర్వీస్ : ఈ సమావేశంలో జియో TVOS, జియోహోమ్ యాప్‌ను కూడా విడుదల చేసింది. జియో సెట్-టాప్ బాక్స్‌ల కోసం ఈ టీవీOS పనిచేస్తుందని చెప్పారు. మెరుగైన అనుభూతిని అందించేందుకు సాయపడుతుందని తెలిపారు. ఈ జియో TVOS అల్ట్రా HD 4K వీడియో, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్‌లున్నాయి.
దీంతోపాటు అప్‌గ్రేడ్ చేసిన హలో జియో వాయిస్ అసిస్టెంట్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేయబడింది. మరియు జియో యాప్ స్టోర్‌లో లైఫ్ స్ట్రైల్, ఫిట్‌నెస్, విద్య సంబంధించిన యాప్‌లను కలిగి ఉంది. వీటితోపాటు అనేక ఫీచర్‌లు సహా వాటి వివరాలు, ఉద్దేశాలను వివరించారు.
జియో ఫోన్‌కాల్ AI :
జియో ఫోన్‌కాల్ AI ను అభివృద్ధి చేస్తున్నట్లు వార్షిక సాధారణ సమావేశంలో అంబానీ తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ కాల్‌ను రికార్డు చేసి జియో క్లౌడ్‌లో స్టోర్ చేస్తుంది. ఇందులోని సంభాషణలను Text రూపంలోకి మారుస్తుంది. దీంతోపాటు ఇతర భాషల్లోకి కూడా అనువాదం చేస్తుందని చెప్పారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుంది తెలిపారు.
జియో బ్రెయిన్ :
జియో యూజర్ల కోసం ఏఐ ప్లాట్‌ఫాం జియో బ్రెయిస్ విస్తరణపై అంబానీ స్పష్టతనిచ్చారు. జియో బ్రెయిన్‌ను మరింత విస్తరిస్తామని, తక్కువ ధరలోనే ఏఐ మోడల్ సర్వీసులను అందిస్తామని తెలిపారు. జియో బ్రెయిన్‌ను జియో ప్లాట్‌ఫాంలోనే వినియోగిస్తున్నామని, రిలయన్స్ అన్ని కంపెనీల్లోనూ ఇక నుంచి ఉపయోగిస్తామని తెలిపారు.
జియో నెట్‌వర్క్ భారత్ దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద డేటా మార్కెట్‌గా మార్చిందని తెలిపారు. ప్రపంచ మొబైల్ ట్రాఫిక్‌లో జియో వాటా 8 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం జియోకు 490 మిలియన్ల మంది (49 కోట్లు) యూజర్లు ఉన్నారని అంబానీ తెలిపారు. ప్రతి జియో కస్టమర్ ఒక నెలలో సగటున 30GB డేటాను వినియోగిస్తున్నారని చెప్పారు. 5G, 6G టెక్నాలజీ 350 పేటెంట్లను ఫైల్ చేసినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








