మరో 5 ఏళ్లు ముఖేష్ అంబానీదే రాజ్యం !

  రిలయన్స్‌ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మరో ఐదేళ్లపాటు ముకేష్‌ అంబానీ కొనసాగేందుకు ఆమోదం తెలపాలని వాటాదారులను కంపెనీ కోరింది. కాగా అంబానీ పదవీకాలం 2019 ఏప్రిల్‌ 19తో ముగుస్తుంది. అప్పటి నుంచి ఆయన పదవీకాలాన్ని ఐదేళ్లపాటు పొడిగించేందుకు చేసిన తీర్మానానికి ఆమోదం తెలపాలని వాటాదారులకు జారీ చేసిన నోటీసులో కంపెనీ పేర్కొంది.వాటాదారులు తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ తదుపరి మరో ఐదేళ్ల పాటు ఆయనే కంపెనీ సారథిగా కొనసాగుతారు.

  ర్యామ్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  జూలై 5న ముంబైలో ..

  కాగా 41వ వార్షిక వాటాదారుల సమావేశం జూలై 5న ముంబైలో జరగనుంది. వాటాదారులకు పంపిన నోటీసులో ముకేష్‌ అంబానీ జీత భత్యాలకు సంబంధించిన వివరాలను కూడా పేర్కొన్నారు. వార్షిక వేతనం 4.17 కోట్ల రూపాయలు, భత్యాలు, ఇతర అలవెన్సుల కింద 59 లక్షల రూపాయలు చెల్లించనున్నట్టు అందులో ఉంది.

  భద్రత కోసం అయ్యే వ్యయాలను..

  ముకేష్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం అయ్యే వ్యయాలను కంపెనీయే భరిస్తుంది. వ్యాపార పర్యటనల సమయాల్లో ముకేశ్, ఆయన సతీమణి, సహాయకుల ప్రయాణ ఖర్చులు, వసతి, ఆయన కుటుంబానికి భద్రత ఖర్చులను చెల్లించనున్నట్టు తెలిపింది.

  రూ.20,000 కోట్ల సమీకరణ

  రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సిడి) ద్వారా 2018-19 సంవత్సరంలో 20,000 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించాలనుకుంటోంది. దీనికి ఆమోదం తెలపాలని వాటాదారులను కోరింది. ఈ నిధులను దేని కోసం వెచ్చించేది మాత్రం వెల్లడించలేదు.

   

   

  ముకేష్ అంబానీ ఇండియాలో పుట్టలేదా, ఎవరికీ తెలియని కొన్ని నిజాలు !

  చౌక డేటా సర్వీసులతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.. తాజాగా గొప్ప ప్రపంచ నాయకుల్లో ఒకరిగా ఫార్చూన్‌ మ్యాగజైన్‌ 2018 జాబితాలో చోటు దక్కించుకున్నారు.అందులో ఆయన 24వ స్థానంలో నిలిచారు.

  యెమెన్ దేశంలోని అడెన్ నగరంలో..

  సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ముకేష్ ధీరూభాయి అంబానీ 1957 ఏప్రిల్ 19న యెమెన్ దేశంలోని అడెన్ నగరంలో జన్మించారు. ధీరూబాయి అంబానీ నలుగురు సంతానంలో ముకేష్ అంబాని ఒకరు.ముఖేష్ కు తమ్ముడు అనిల్ అంబానీ, ఇద్దరు చెల్లెళ్ళు దీప్తి సలగొన్కర్, నైనా కొఠారీ ఉన్నారు.

  అడెన్ లో పెరిగిన రాజకీయ అస్థిరత కారణంగా ..

  అయితే అడెన్ లో పెరిగిన రాజకీయ అస్థిరత కారణంగా 1958లో ధీరూబాయి అంబాని కుటుంబం అక్కడి నుంచి ముంబైకి మకాం మార్చింది. ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో ఒక చిన్న రెండు పడకగదుల ఇంట్లో ఉండేవారు.ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ధీరూభాయ్ కోల్బాలో 14 అంతస్తుల భవనాన్ని కొన్నారు. దాని పేరు "సీ విండ్".

  అంబానికి హాకి అంటే అమితమైన ఆసక్తి

  ముకేష్ అంబాని క్రికెట్ పట్ల ఇప్పుడు అమితమైన అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ముంబై ఇండియన్స్ ఫ్రాంచేజీని కూడా తీసుకున్నారు. అయితే స్కూల్ డేస్ లో ముకేష్ అంబానికి హాకి అంటే అమితమైన ఆసక్తి ఉండేది. దీని కోసం తన చదువుకును కూడా నిర్లక్ష్యం చేశారు.

  బెస్ట్ ఫ్రెండ్స్..

  బిజినెస్ రంగంలో తిరుగులేని ఆధిపత్యంతో దూసుకుపోతున్న ఆది గోద్రేజ్, మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా స్కూలు స్థాయిలో అంబానీకి బెస్ట్ ఫ్రెండ్స్.వీరంతా చిన్నప్పుడు ఒకే స్కూలులో చదివారు.ముంబైలో పెద్దర్ రోడ్లోని హిల్ గ్రేంజ్ హైస్కూల్లో ఈ స్నేహితులంతా కలిసి చదువుకున్నారు. ముకేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా వీళ్లతో పాటు అక్కడే చదివారు.

  ఆల్కాహాల్..

  ముకేష్ అంబానీ తన జీవితంలో ఒక్కసారి కూడా ఆల్కాహాల్ ను రుచి చూడలేదు. అదంటే ఆయనకి అసలు ఇష్టం ఉండదట. ఇక తిండి విషయానికొస్తే ప్యూర్ వెజిటేరియన్. ఒక్కసారి కూడా మాంసాహారాన్ని ముట్టలేదట.

  అత్యంత ఖరీదైన రెసిడెన్సియల్ ప్రాపర్టీ..

  ప్రపంచంలోనే అత్యంత పెద్ద రిఫైనరీ ముకేష్ అంబానీదే. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉంది. ఇది రోజుకు 668000 barrels వ్యవప్థాగత సామర్ధ్యం కలిగి ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్సియల్ ప్రాపర్టీ కూడా ముకేష్ అంబానీదే. ఆంటిల్లా అనే పేరుతో సౌత్ ముంబైలో ఇది ఉంది. ఇందులో 600 మంది కన్నా ఎక్కువే పనిచేస్తుంటారు.

  కార్లంటే చాలా ఇష్టం

  అంబానీకి కార్లంటే చాలా ఇష్టం.దాదాపు 168 కార్లు వారితో ఉన్నాయని అనధికార రిపోర్టులు తెలియజేస్తున్నాయి. వీటిల్లో BMW 760LI ప్రధానమైనది. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూప్ కార్. బాంబులతో పేల్చినా చెక్కు చెదరదు. దీన్ని ఇప్పుడు ప్రధాని మోడీ వాడుతున్నారు. దీంతో పాటు Mercedes-Maybach Benz S660 Guard, Aston Martin Rapide, Rolls Royce Phantom and Bentley Continental Flying Spur లాంటి కార్లు కూడా ఉన్నాయి.

  జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యాపారస్థుల్లో ..

  జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యాపారస్థుల్లో ముకేష్ అంబానీ మాత్రమే ఉన్నారు. జియోను తీసుకువచ్చి టెలికాం ప్రపంచాన్ని అంబానీ పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. ఇక సంవత్సరానికి జీతంగా ఇతను అందుకునే మొత్తం రూ.15 కోట్లు. ఇది ఇప్పుడు చాలా పెరిగి ఉండవచ్చు.

  కంపెనీల విలువ

  ఈ జియో అధినేత కంపెనీల విలువ ఇండియాకి వచ్చే మొత్తం రెవిన్యూ టాక్స్‌లోని 15 శాతం విలువకు సమానమంటే నమ్ముతారా.. ఇది నిజం 2017లో ఇతని ఆస్తుల విలువ 110 billion యుఎస్ డాలర్స్. ఇది ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుందని అంచనా.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  RIL seeks extending Mukesh Ambani's term by 5 years More news at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more