బ్లాక్‌బెర్రీ ఫోన్లకు రణ్‌బీర్ ప్రచారం

Posted By: Prashanth

బ్లాక్‌బెర్రీ ఫోన్లకు రణ్‌బీర్ ప్రచారం

 

నిత్యం సంచలనాలతో వార్తల్లో నిలిచే బాలివుడ్ హిరో రణబీర్ కపూర్ తో బ్లాక్ బెర్రీ జత్తకట్టింది. దేశీయంగా రిమ్ ప్రచార బాధ్యతలను కపూర్ వచ్చే జనవరి నుంచి చేపట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..... బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ ల రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) తన బ్రాండ్ ప్రచారకర్తగా ప్రముఖ బాలీవుడ్ హిరో రణబీర్ కపూర్ ను నియమించింది. భారత్ లో విస్తరిస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, వృత్తినిపుణులను దృష్టిలో ఉంచుకుని రణ్ బీర్ ను ఎంచుకున్నట్లు రిమ్ ఇండియా ఎండీ సునీల్ దత్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం రెండేళ్లు పాటు కొనసాగుతుందని దత్ తెలిపారు. 2013 జనవరి 30నుంచి కపూర్ ప్రచారం మొదలవుతుందని దత్ ఈ సందర్భంగా పీటీఐకు వివరించారు.

గ్రాఫిక్ అద్భుతాలు (టాప్-10)

బ్లాక్‌బెర్రీ బీబీ10 స్మార్ట్‌ఫోన్..‘బ్లాక్‌బెర్రీ జడ్ 10’

బ్లాక్‌బెర్రీ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘బీబీ10’ విడుదలకు సమయం సమీపిస్తున్న నేపధ్యంలో ఈ వోఎస్ ఆధారితంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ పై అనేక రూమర్లు వ్యక్తమవుతున్నాయి. రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) అధికారికంగా ప్రకటించిన వివరాల మేరకు బీబీ10 వోఎస్‌ను జనవరి 30న ఆవిష్కరించనున్నారు. బీబీ10 ఫ్లాట్‌ఫామ్ పై స్పందించే తొలి స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనేక గుసగుసలు వినిపిస్తున్న నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్ ‘అన్‌వైరిడ్ వ్యూ’ బ్లాక్‌బెర్రీ 10 ఎల్-సిరీస్‌కు చెందిన ‘బ్లాక్‌బెర్రీ జడ్ 10’ హ్యాండ్‌సెట్ వివరాలను బహిర్గతం చేసింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting