కస్టమర్స్‌కు 'బ్లాక్‌బెర్రీ' కృతజ్ఞతలను తెలియచేస్తూ..

Posted By:

కస్టమర్స్‌కు 'బ్లాక్‌బెర్రీ' కృతజ్ఞతలను తెలియచేస్తూ..

 

బ్లాక్‌బెర్రీ మొబైల్ తయారీ దారు ఆసియాలో ఉన్న బ్లాక్‌బెర్రీ వివియోగదారలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేయడంతో పాటు, వారికి బ్లాక్‌బెర్రీ ధన్యవాదాలను తెలుపుతూ కొత్త వీడియోని విడుదల చేసింది. ఇటీవల కాలంలో సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్, ఆపిల్ దెబ్బకు అమెరికన్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ అమ్మకాలు కొద్దిగా తగ్గినప్పటికీ, ఆసియాలో మాత్రం బ్లాక్‌బెర్రీ మొబైల్ అమ్మకాలు ఎక్కువగా ఉండడంతో ఆసియా కస్టమర్స్‌కి కృతజ్ఞతలను తెలియజేస్తూ బ్లాక్‌బెర్రీ వీడయోని విడుదల చేసినట్లు బ్లాక్‌బెర్రీ ప్రతినిధులు వెల్లడించారు.

ఆసియా మార్కెట్లో బ్లాక్‌బెర్రీ అమ్మకాలు ఎక్కవగా ఉండడమే కాకుండా, కస్టమర్స్ బ్లాక్ బెర్రీ మొబైల్స్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని బ్లాక్‌బెర్రీ కో - సిఈవో జిమ్ బల్సిల్లీ ఇటీవల కొత్త హ్యాండ్ సెట్‌ని ఇండోనేసియాలో విడుదల చేసిన సందర్బంలో గుర్తు చేసారు. ఆసియా ఫసిఫిక్ రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ 'గ్రెగొరీ వాడే' మాట్లాడుతూ ఆసియా రీజియన్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ 42 శాతాన్ని చేజిక్కించుకోవడం జరిగింది.

సంవత్సరానికి గాను బ్లాక్ బెర్రీ 4 మిలియన్ల స్మార్ట్ ఫోన్స్‌ని అమ్ముతున్నట్లు అధికారకంగా ధృవీకరించింది. దీనిని బట్టి ఆసియా ఫసిఫిక్ మార్కెట్ రీసెర్చ్ ఇన్ మోషన్‌కి చాలా ముఖ్యమని అన్నారు. ఆసియా ఫసిఫిక్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్‌ని ఆకర్షించే భాగంగా రీసెర్చ్ ఇన్ మోషన్ కొత్త కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే.

ఇండోనేషియాలోనే కాకుండా ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లో ఉన్న ధాయ్ లాండ్, ఫిలిఫ్పెన్స్‌ స్మార్ట్ ఫోన్స్  మార్కెట్లో రీసెర్చ్ ఇన్ మోషన్ నెంబర్ వన్‌గా కొనసాగుతుంది. బ్లాక్‌బెర్రీ కస్టమర్స్ ఎవరైనా బ్లాక్ బెర్రీ విడుదల చేసిన వీడియోని చూడాలనుకుంటే ఈ లింక్ ద్వారా http://www.youtube.com/watch?v=YGWVklbnNgU&feature=player_embedded వీక్షించవచ్చు.

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot