కారు చౌకగా బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు..?

Posted By: Prashanth

కారు చౌకగా బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు..?

 

బ్లాక్‌బెర్రీ ఫోన్ల రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) ఇటీవల ఇండియాలో బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల ధరలను (ఎంపిక చేసినవి మాత్రమే) 18 నుంచి 26 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకట్టుకోవటంతో పాటు ఆండ్రాయిడ్ అధిపత్యాన్ని తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిమ్ ఇండియా అప్పట్లో తెలపింది.

తాజాగా ఈ సర్వోత్తమ బ్రాండ్ తమ హ్యాండ్‌సెట్‌ల ధరలను మరింత తగ్గించే యోచనలో ఉంది. ధరల తగ్గింపు అంశం పై రిమ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ సునీల్ దత్ స్పందిస్తూ స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారానికి స్వర్గధామం లాంటి భారత్‌లో వినియోగదారులు సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంగా ఈ ఫార్ములాను ప్రయోగిస్తున్నట్లు తెలిపారు.

రిమ్ తాజా నిర్ణయం అమలుతో బ్లాక్‌బెర్రీ హ్యాండ్‌సెట్ల ధరలు దాదాపు 10,000 దిగువకు పడిపోనున్నాయి. ఇదిలా ఉండగా దిగ్గజ బ్రాండ్ శామ్‌సంగ్ 10 వేల దిగువ ధరకు 6 హ్యాండ్ సెట్‌లను రూపొందించింది. లావా, కార్బన్‌లు సైతం ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నాయి.

ధరను 18 నుంచి 26 శాతానికి తగ్గించిబడిన న బ్లాక్ బెర్రీ ఫోన్ లు వాటి పాత, కొత్త ధరలు

కర్వ్ 8520 (ఎంట్రీ లెవల్ మోడల్ ) – పాత ధర రూ.10,990, కొత్త ధర రూ.8,999.

టార్చ్ 9860 – పాత ధర రూ.29,990, కొత్త ధర రూ.21,990,

కర్వ్ 9380 – పాత ధర రూ.20,990, కొత్త ధర రూ.16,990,

కర్వ్ 9360 – పాత ధర రూ.19,990, కొత్త ధర రూ.18,900.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot