రీసెర్చ్ ఇన్ మోషన్ కొత్త అప్‌గ్రేడ్ 'ప్లే బుక్ 2.0'

Posted By: Staff

రీసెర్చ్ ఇన్ మోషన్ కొత్త అప్‌గ్రేడ్  'ప్లే బుక్ 2.0'

 

లాస్ వేగాస్‌లో రోడ్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి. ఇందుకు కారణం 2012 సంవత్సరానికి గాను లాస్ వేగాస్ 'కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో'కి ఆతిధ్యం ఇవ్వడమే. సోమవారం నుండి జరుగుతున్న ఈ సిఈఎస్(కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో)లో త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న కొత్త కొత్త ఎలక్ట్రానిక్స్ పరికరాలకు సంబంధించి ప్రదర్శనను ఉంచారు. బ్లాక్ బెర్రీ తయారీదారు 'రీసెర్చ్ ఇన్ మోషన్' కొత్తగా రూపొందించిన క్యూఎన్ఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే ప్లేబుక్ టాబ్లెట్‌ని ప్రదర్శించింది.

అమెరికా అతి పెద్ద రెండవ క్యారియర్ అయిన ఏటి & టి కూడా నాణ్యమైన ఉత్పత్తులను షోలో ప్రదర్శించింది. ఏటి & టి ప్రవేశపెట్టిన హై స్పీడ్ డివైజెస్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2012లో మద్యలో పవర్ పుల్ ఎనర్జీ శక్తివంతమైన ఛిప్ సెట్‌ని తీసుకురానున్నారని తెలిపారు. ఈ ఛిఫ్ సెట్ సహాయంతో హై స్పీడ్ నెట్‌వర్క్‌లకు అనుబంధంగా పని చేసే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్(Long Term Evolution)ను సపోర్ట్ చేస్తుంది.

రాబోయే కాలంలో అమెరికాలో రూపొందించే డివైజ్‌లన్నీ కూడా ఎల్‌టిఈ నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేయనున్నాయి. ఇక రీసెర్చ్ ఇన్ మోషన్  'కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో'లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లే బుక్ 2.0 సాప్ట్‌వేర్‌ని విడుదల చేసింది. ఈ ప్లే బుక్ 2.0 సాప్ట్‌వేర్‌ ఈమెయిల్, క్యాలెండర్, అడ్రస్ బుక్ ఫంక్షన్స్‌తో పాటు, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌ని రన్ చేసే సామర్ద్యం ఉంది.

దీనితో పాటు రీసెర్చ్ ఇన్ మోషన్ ప్లే బుక్ కోసం వీడియో స్టోర్‌ని అందుబాటులోకి తీసుకోని వచ్చింది. ఈ వీడియో స్టోర్‌లో కస్టమర్స్ వందల కొద్ది ఉన్న సినిమాలు, టెలివిజన్ షోలను అద్దెకు లేదా కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఐతే రీసెర్చ్ ఇన్ మోషన్ ఫ్రీగా సాప్ట్‌వేర్  అందించనున్న విషయాన్ని మాత్రం తెలియ జేయలేదు.

రీసెర్చ్ ఇన్ మోషన్ క్యూఎన్‌ఎక్స్  ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే స్మార్ట్ ఫోన్‌ని 2012లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శనకు ఉంచిన ప్లే బుక్ సాప్ట్‌వేర్ కూడా అతి త్వరలోనే కస్టమర్స్‍‌కి అందుబాటులోకి తీసుకరానుంది. ఏప్రిల్‌లో రీసెర్చ్ ఇన్ మోషన్, ప్లే బుక్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు చూసుకున్నట్లేతే రీసెర్చ్ ఇన్ మోషన్ కేవలం 850,000  ప్లే బుక్స్‌ని మాత్రమే అమ్మడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot