ఫ్రీడం 251 ఫోన్ల కథ ముగిసింది !

Written By:

రింగింగ్ బెల్స్ ఈ కంపెనీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందిస్తామంటూ ముందుకొచ్చిన కంపెనీ..రూ.251కే స్మార్ట్‌ఫోన్ అంటూ దేశ వ్యాప్తంగా సంచంనలం కూడా రేపింది. అయితే అనుకున్న సమయానికి డెలివరీ ఇవ్వక కంపెనీ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ కథ పూర్తిగా కంచికి చేరినట్లు కనిపిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోహిత్ గోయల్

రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ మోహిత్ గోయల్ ఆ సంస్థ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

విభేదాల కారణంగా

ఈ సంస్థను అన్నదమ్ములు మోహిత్, అన్మోల్ కలసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారిద్దర మధ్య విభేదాల కారణంగా మోహిత్ తో పాటు సంస్థ సీఈవో, మోహిత్ గోయల్ భార్య ధారణ గోయల్ కూడా రాజీనామా చేసినట్టు సమాచారం.

2016 ఫిబ్రవరిలో

దీంతో 2016 ఫిబ్రవరిలో మొబైల్ సంస్థల గుండెల్లో గుబులు రేపిన రింగింగ్ బెల్స్ కథ ఏడాది తిరగకుండానే ముగిసిపోయే ప్రమాదంలో పడగా, మోహిత్ సోదరుడు అన్మోల్ ప్రస్తుతం కంపెనీ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

కార్యకలాపాలు యథావిధిగా

అశోక్ చద్దా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నట్టు అందులో పేర్కొంది. తమ సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని, స్పష్టమైన వ్యాపార లక్ష్యాలకు కట్టుబడి వున్నామని వ్యవస్థాపక నిర్వాహకుడైన అన్ మోల్ ప్రకటించారు.

ఎండీఎం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో

కాగా, రింగింగ్ బెల్స్ నుంచి రాజీనామా చేసిన మోహిత్ గోయల్ ఎండీఎం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Freedom 251-maker Ringing Bells’ MD Mohit Goel quits amidst rumors of shutdown: Report read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot