రూ.10 వేలకే హెచ్‌డి ఎల్ఈడీ టీవి..బుకింగ్ డేట్ ఫిక్స్

Written By:

రింగింగ్ బెల్స్..ఈ పేరు తెలియని వారు ఇండియాలో ఎవరూ ఉండరు..ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఎవరూ ఉండకపోవచ్చు..ఎందుకంటే రూ. 250కే ఫోన్ అంటూ సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మరో సంలచంతో మళ్లీ ముందుకొచ్చింది. రూ.10వేలకు 31.5 అంగుళాల ఎల్ఈడీ టీవి ఇస్తామంటూ ముందుకొచ్చింది.బుకింగ్ చేసుకోవాలంటూ ప్రకటన కూడా రిలీజ్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.10 వేలకే హెచ్‌డి ఎల్ఈడీ టీవి..బుకింగ్ డేట్ ఫిక్స్

ప్రపంచంలోనే అతి తక్కువ ఖరీదైన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి సంచలనానికి తెరలేపిన రింగింగ్ బెల్స్ ఫ్రీడం టీవీలంటూ వినియోగదారుల ముందుకొస్తోంది.

రూ.10 వేలకే హెచ్‌డి ఎల్ఈడీ టీవి..బుకింగ్ డేట్ ఫిక్స్

రూ.10 వేల లోపే చీపెప్ట్ హెచ్డీ ఎల్ఈడీ టీవీ అంటూ మరో సంచలనాత్మక ప్రకటన చేసింది.

రూ.10 వేలకే హెచ్‌డి ఎల్ఈడీ టీవి..బుకింగ్ డేట్ ఫిక్స్

తమ కొత్త 'ప్రీడమ్ 9900' టీవీలకోసం ఆగస్టు 15 న బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటన చేసింది. నోయిడా ఆధారిత ఈ స్మార్ట్ ఫోన్ మేకర్ 31.5 అంగుళాల హెచ్‌డీ ఎల్ఈడీ టీవీల ను రూ. 9,900లకే అందించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది.

రూ.10 వేలకే హెచ్‌డి ఎల్ఈడీ టీవి..బుకింగ్ డేట్ ఫిక్స్

ఆగస్టు 15 న బుకింగ్ మొదలవుతుందనీ, తరువాతి రోజు నుంచి (ఆగస్టు 16 ) పంపిణీ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. క్యాష్ ఆన్ పద్ధతిలో వీటిని డెలివరీ చేయనున్నట్టు రింగింగ్ బెల్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

రూ.10 వేలకే హెచ్‌డి ఎల్ఈడీ టీవి..బుకింగ్ డేట్ ఫిక్స్

1366x768 పిక్సెల్స్, రిజల్యూషన్, 3000 కాంట్రాస్ట్ రేషియో, రెండు హెచ్ డీ ఎంఐ పోర్ట్సు, రెండు యూసీబీ పోర్టులు, రెండు స్పీకర్ల తదితర ఫీచర్లు దీని సొంతం. అసక్తివున్నవారు సంస్థ వెబ్ సైట్ రింగింగ్‌బెల్స్ .కో.ఇన్ వెబ్‌సైట్ లో బుకింగ్ లు చేసుకోవచ్చు.

రూ.10 వేలకే హెచ్‌డి ఎల్ఈడీ టీవి..బుకింగ్ డేట్ ఫిక్స్

తమ ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ మాదిరిగానే తమ టెలివిజన్ కు కూడా మంచి స్పందన వస్తుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో సరసమైన ధరలో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తామనే భరోసా వినియోగదారులకు ఉందని పేర్కొంది.

రూ.10 వేలకే హెచ్‌డి ఎల్ఈడీ టీవి..బుకింగ్ డేట్ ఫిక్స్

మరి ఇది కూడా ముందు ముందు ఫోన్ లాగానే ఉంటుందా..లేక మరో సంచలనం రేపుతుందా అనేది ముందు ముందు చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Ringing Bells opens booking of HD LED TV on August 15
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot