మసాజ్ కావాలా, అయితే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌కెళ్లండి

|

మీరు జీవితంలో మరచిపోలేని మసాజ్ చేయించుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకోసం అదిరిపోయే మసాజ్ రెడీగా ఉంది. ఎక్కడో తెలుసా.. కార్పోరేట్ దిగ్గజం, మహీంద్ర అండ్‌ మహీంద్ర ఛైర్మన్​ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ అకౌంట్‌లో.. మసాజ్ ఎక్కడైనా ట్విట్టర్ అకౌంట్లో లభిస్తుందా అని ఆవేశపడకుండా న్యూస్ లోకి వెళితే మీకు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.

మసాజ్ కావాలా, అయితే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌కెళ్లండి

కార్పోరేట్ దిగ్గజం, మహీంద్ర అండ్‌ మహీంద్ర ఛైర్మన్​ ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ట్విట్టర్లో బిజీగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ సారి మరోసారి ఆసక్తికరమైన ట్విట్‌తో వార్తల్లో నిలిచారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికరమైన, ఇన్నోవేటివ్‌ అంశాలను షేర్‌ చేస్తూ వుండే ఆనంద్ మహీంద్రా ఈ సారి ఒక హిల్లేరియస్‌ ఫోటోను ట్వీట్‌ చేశారు. తద్వారా తన సెన్సాఫ్ హ్యూమర్‌ను చాటుకున్నారు.

మసాజ్ కావాలా, అయితే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌కెళ్లండి

బాడీ మసాజ్ ప్రకటన,
ఒక రోడ్ రోలర్ చక్రంపై బాడీ మసాజ్ ప్రకటన పోస్టర్ నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టర్‌ ఒక రోడ్ రోలర్ చక్రం మీద అంటించడమే ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బాడీ మసాజ్ కేవలం రూ.499 మాత్రమే అని దానిపై రాసి ఉంది. ఇక ఆయన ఊరుకుంటారా? వెంటనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దానికి చక్కటి కమెంట్‌ యాడ్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌ అయింది.
ఇలాంటి మసాజ్‌ ఒకసారి చేసుకుంటే చాలు...ఇక జీవితంలో మరోసారి దీని అవసరం రాదు. ఈ మసాజ్‌తో శరీరంలోని రుగ్మతలన్నీ మటుమాయమంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఈ పోస్టర్ అంటించిన వ్యక్తికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ అయినా ఉండాలి లేదంటే ఐక్యూ లెవల్ అయినా తక్కువగా ఉండాలని ట్వీట్ చేశారు.

మసాజ్ కావాలా, అయితే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌కెళ్లండి

70 లక్షల మంది ఫాలోయర్లు

కాగా ట్విటర్‌లో ఆనంద్ మహీంద్రాకు 70 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు దాదాపు 5,184 లైక్స్ వచ్చాయి. 730 మంది రీట్వీట్ చేశారు. అలాగే 297 మెసేజ్‌కు కూడా వచ్చాయి.సామాజిక అంశాలతో పాటు వాణిజ్య రంగం మీద కూడా ఆనంద్ మహీంద్రా అప్పుడప్పుడు ట్వీట్ చేస్తుంటారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో చైనా పెట్టుబడులు భారత్‌ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు.

భారత్‌లోకి చైనా పెట్టుబడులు

వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమవుతారన్న వార్తల నేపథ్యంలో మహీంద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'ఒకవేళ వివాదాస్పద అంశాలు పరిష్కారమైనప్పటికీ .. అమెరికాకు భారీగా ఎగుమతులు చేసే చైనా సంస్థలు .. కొంత హెడ్జింగ్‌ కోసం భారత్‌లోనూ అనుబంధ సంస్థలపై పెట్టుబడులు పెట్టడం, తయారీ పరిజ్ఞానాన్ని బదలాయించడం వివేకవంతమైన నిర్ణయం అవుతుంది. ఈ రకంగా భారత్‌లోకి చైనా పెట్టుబడులు వెల్లువెత్తడం ఖాయం' అని మైక్రో బ్లాగింగ్‌ సైటు ట్విటర్‌లో ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు. చాలా భారతీయ కంపెనీలు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. చైనా పెట్టుబడులతో భారత్‌కు ప్రస్తుతం అవసరమైన ఉద్యోగాల కల్పన జరిగేందుకు అవకాశం ఉందని ఆనంద్‌ మహీంద్రా తెలిపారు.

మసాజ్ కావాలా, అయితే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌కెళ్లండి

భారత్‌లోనూ ఉద్యోగ అవకాశాలు

రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ ముగిసినా, ముందు జాగ్రత్త కోసం చైనా కంపెనీలకి ఇది (భారత్‌లో యూనిట్లు ఏర్పాటు) తప్పనిసరి అన్నారు. దీని వల్ల భారత్‌లోనూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ లెక్కన భారత్‌లోకి చైనా పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చైనా పెట్టుబడులతో భారత్‌లో అవసరమైన ఉద్యోగాల కల్పన జరిగే అవకాశముందన్నారు.

Best Mobiles in India

English summary
Road roller massage for Rs 499? Anand Mahindra leaves Internet dying over viral pic

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X