80 కోట్ల ఉద్యోగాలు కనుమరుగు, మానవ మేధస్సుకు సవాల్

మానవుడు సృష్టించిన అద్భుతాలలో రోబో ఒకటి.ఇది మానవ మేధస్సు కి ప్రతిరూపం. అయితే మానవుడి ఉపాధిని మర మనుషులు ఆక్రమించుకునే రోజులు వచ్చేస్తున్నాయి.

|

మానవుడు సృష్టించిన అద్భుతాలలో రోబో ఒకటి.ఇది మానవ మేధస్సు కి ప్రతిరూపం. అయితే మానవుడి ఉపాధిని మర మనుషులు ఆక్రమించుకునే రోజులు వచ్చేస్తున్నాయి.2030 కల్లా అనేక రంగాల్లో లక్షల కొలువులు గల్లంతు అవ్వబోతున్నాయి.మానవ ఉపాధిని మరమనుషులు స్వాధీనం చేసుకునే క్రమం ఇప్పటికే ఆరంభం అయిపోయింది. టేకోవర్ ఇప్పటికే మొదలైపోయింది. రోబోలే పూర్తి ఉపాధిని ఆక్రమించిన పారిశ్రామిక రంగాలు ఇప్పటికే ఉనికిలోకి వచ్చాయి. భవిష్యత్లో మరిన్ని రంగాలు ఈ రోబోలతో నిండిపోనున్నాయి. కోట్లాది మంది ఉద్యోగాలు గల్లంతు కానున్నాయి.

జియో గిగా ఫైబర్ ప్లాన్ల వివరాలపై అప్‌డేట్ ఏంటీ ? ఓ లుక్కేసుకోండిజియో గిగా ఫైబర్ ప్లాన్ల వివరాలపై అప్‌డేట్ ఏంటీ ? ఓ లుక్కేసుకోండి

2030 నాటికి 80 కోట్ల మంది ఉద్యోగాలు..

2030 నాటికి 80 కోట్ల మంది ఉద్యోగాలు..

రోబోలు, ఆటోమేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే వెల్లడించింది.

46 దేశాల్లో నిర్వహించిన సర్వే వివరాలను..

46 దేశాల్లో నిర్వహించిన సర్వే వివరాలను..

46 దేశాల్లో నిర్వహించిన సర్వే వివరాలను మెకిన్సే గతేడాది నవంబర్ 29న వెల్లడించింది. 

అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు..

అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు..

దీని వల్ల మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్-ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని తెలిపింది. దీంతో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కోనున్నాయి.

భారత్‌లో 11-12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు ..

భారత్‌లో 11-12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు ..

ఆటోమేషన్ వల్ల భారత్‌లో 11-12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చని మెకిన్సే అంచనా వేసింది. అత్యధికంగా చైనాలో దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోగా అమెరికాలో 5-8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.

ఈ ఉద్యోగాలకు ఎసరు

ఈ ఉద్యోగాలకు ఎసరు

రోబో కౌన్సెలర్‌
మిక్సీలా, వాషింగ్‌ మెషీన్‌లా ఇంటికో రోబో ఉండాల్సిందే..పని మనిషి బాధ్యతలన్నీ ఈ రోబోలకే.. మీ కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా....మీ అవసరాలేమిటి, ఎలాంటి రోబో కావాలి, దానికి ఎంత సామర్థ్యం ఉండాలి, ఏవైనా కొత్త ఫీచర్స్ ఏమైనా జోడించాలా... ఇలాంటి విషయాల్లో సలహాలిచ్చేందుకు రోబో కౌన్సెలర్లు అవసరం అవుతారు.

ఈ ఉద్యోగాలకు ఎసరు

ఈ ఉద్యోగాలకు ఎసరు

మ్యాన్‌-మెషీన్‌ టీమింగ్‌ మేనేజర్‌
టీమ్‌ లీడర్‌, టీమ్‌ మేనేజర్‌ అని పిలుచుకునే ఉద్యోగాల్నే, 2030 తరువాత ‘మ్యాన్‌ మెషీన్‌ టీమింగ్‌ మేనేజర్‌'గా పేరు మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, భవిష్యత్తులో రోబోలూ మనుషులూ కలిసి పనిచేయాల్సి వస్తుందిగా. ఆ ప్రకారంగా, టీమ్‌ మేనేజర్‌ బాధ్యతా మారిపోతోంది. అటు మనిషిని, ఇటు యంత్రాన్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎసరు

ఈ ఉద్యోగాలకు ఎసరు

ఆకాశంలో హైవే కంట్రోలర్‌
ఈ ఉద్యోగం పేరు ‘హైవే కంట్రోలర్...2030 నాటికి... భూమి మీద రోబోలతో పాటూ... ఆకాశంలో డ్రోన్లూ పెరిగిపోతాయి. డ్రోన్లను కూడా ఎగిరే రోబోలే కాబట్టి...ఇప్పుడు భూమి మీద ఎంత ట్రాఫిక్‌ ఉంటుందో... అప్పుడు ఆకాశంలోనూ డ్రోన్లతో అంతే ట్రాఫిక్ ఉండబోతోంది. అందుకే ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేసే ఉద్యోగాలు భారీగా అవసరం పడతాయి.

గార్బేజ్‌ డిజైనర్స్‌

గార్బేజ్‌ డిజైనర్స్‌

రీసైక్లింగ్... చేయడానికి 2030 తరువాత ప్రత్యేక ఉద్యోగులు రాబోతున్నారు. రీసైక్లింగ్ వారిని గార్బేజ్‌ డిజైనర్స్‌ అంటారు. ఒక వస్తువు పాడయ్యాక దాన్ని మరో ఉపయోగకరమైన రూపంలోకి మార్చడం వీరి పని. ఉదాహరణకు ఒక పెన్ ను వాడి పడేశామనుకోండి. దాన్నే వాళ్లు ఏ ఫ్యాన్సీ బ్రాస్ లెట్ గానో మారుస్తారు. ప్రతి వస్తువును ఉపయోగపడేలా చేయడమే గార్బేజ్‌ డిజైనర్స్‌పని..

ఈ ఉద్యోగాలకు ఎసరు

ఈ ఉద్యోగాలకు ఎసరు

నోస్టాలజిస్టు
ఇదో కొత్తరకం ఉద్యోగం. భిన్న రకాల పాత్రలను ఈ ఉద్యోగులు పోషించనున్నారు. ఇంటీరియర్‌ డిజైనర్లుగా, చరిత్ర పరిశోధకులుగా వ్యవహరిస్తారు. కస్టమర్స్‌ ఇంటినీ ఇంటీరియర్స్ నూ... తాము కోరిన కాలంనాటి పద్ధతుల్లో డిజైన్‌ చేసుకునేందుకు సాయం చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా 1980లలోని రేడియోలూ, హార్మోనియంలూ కావాలని అడిగితే... అవన్నీ ఇంట్లో పెట్టి పాత కాలం నాటి ఇల్లు అనిపించేలా తీర్చిదిద్దుతారు. అది నోస్టాలజిస్టుల పని.

సోలార్‌ టెక్నాలజీ స్పెషలిస్టు

సోలార్‌ టెక్నాలజీ స్పెషలిస్టు

ఇప్పటికే మనం సౌరశక్తి మీద ఆదరపడుతున్నాం..భవిష్యత్తులో పూర్తిగా... సౌరశక్తి మీదే ఆధారపడాల్సి ఉంటుంది. ఈ రంగంలో రోబోలకు కాకుండా, మనుషులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కనున్నాయి. సోలార్‌ ప్యానెల్స్‌ డిజైనింగ్ కు, నిర్వహణకు సోలార్‌టెక్నాలజీ స్పెషలిస్టు ఉద్యోగాలు భారీగా అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఉద్యోగాలకు ఎసరు

ఈ ఉద్యోగాలకు ఎసరు

ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌ థెరపిస్టులు
మనిషి జీవితకాలాన్ని పెంచేందుకు చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అదే సాధ్యమైతే, మనిషి చివరి రోజులు అతడికి ముందే తెలిసిపోతాయి. ఆ చివరిదశకు కొన్నాళ్ల ముందే... ప్రశాంతంగా శరీరాన్ని వదిలిపెట్టేలా ప్లాన్‌ చేసేందుకు ‘ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌ థెరపిస్టులు' సహకరిస్తారు. అనాయాసమరణాన్ని అందించడం వీళ్ల ఉద్యోగ ధర్మం. అంటే, క్లయింట్‌ చావును ఎలాంటి నొప్పి, సమస్య లేకుండా సాఫీగా ముగించేస్తారు.

టెలీ సర్జన్‌

టెలీ సర్జన్‌

ఇప్పుడు వైద్యులు రోగి ఎదురుగా నిలబడి సర్జరీలు చేస్తున్నారు. భవిష్యత్తులో వైద్యుడు, రోగి వేరువేరు ప్రదేశాల్లో ఉన్నా... శస్త్రచికిత్సలు జరిగిపోతాయి. రోగి ఉన్నచోట రోబోటిక్‌ చేతులు సర్జరీ చేస్తుంటే... ఎక్కడో ఉన్న వైద్యుడు ఆన్‌లైన్‌లో ఆ చేతుల్ని నియంత్రిస్తుంటాడు.

Best Mobiles in India

English summary
Robots will take our jobs. We'd better plan now, before it's too late more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X