బాంబులు దీని ముందు బేజారే!

Posted By:

 బాంబులు దీని ముందు బేజారే!

లండన్: బ్రిటన్‌లోని వెస్ట్ ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏడుగురు కాలేజీ విద్యార్థులు నిర్విరామంగ శ్రమించి చేపట్టిన ఓ వినూత్న ఆవిష్కరణ ఔరా అనిపిస్తుంది. ఇంటిలో మూలనపడున్న వివిధ పరికరాల విడిభాగాలను సేకరించి ఓ అద్భుత రోబో యంత్రాన్ని ఈ బృందం రూపొందించింది. ఈ సాంకేతిక మరయంత్రం నీళ్లలో అమర్చిన మందుపాతరలను గుర్తించటంతో పాటు సముద్రాల్లో ఖనిజాలనూ అన్వేషిస్తుంది. అంతేకాదండోయో.. చెత్త చెదారాన్ని కూడా తొలగిస్తుంది. ఈ అటానమస్ అండర్‌వాటర్ వెహికిల్(ఏయూవీ) నిర్మాణంలో భాగంగా ఇంటర్‌నెట్ రౌటర్, కారు విడిభాగాలు, ప్లేస్టేషన్ గేమింగ్ బాక్స్ కెమెరా, కంప్యూటర్ ఫాన్లు వంటివి ఉపయోగించారట.

రక్షణ శాఖ అవసరాలను దృష్టిలో పెట్టుకునే దీన్ని రూపొందించామని విద్యార్థి బృందం తెలిపింది. త్వరలో ఇటలీ జరుగనున్న అంతర్జాతీయ పోటీకి ఈ రోబోను పంపిస్తున్నట్లు తెలిపారు. దీని తయారీకి దాదాపు రూ. 16లక్షలు ఖర్చయిందట. ' నీటిలో మందుపాతరల వెలికితీతకు మానవ ప్రమేయం అవసరమవుతోంది. ఇది ప్రాణాంతమైనది. మా రోబో మాత్రం స్వతంత్రంగా పనిచేస్తుంది. దీన్ని ఇంకా అనేక అవసరాల కోసమూ వాడుకోవచ్చ ని విద్యార్థులు వివరించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting