Home
News

Robot Suicide ప్రపంచంలో తొలిసారిగా పని ఒత్తిడితో రోబో ఆత్మహత్య... ఎక్కడ జరిగింది..?

పని ఒత్తిడి.. అనే మాట ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఉద్యోగుల్లో ఎక్కువగా ఈ మాట వింటుంటాం. అయితే మనుషుల్లో పని ఒత్తిడి వంటి సహజం అయితే రోబోలకు కూడా పని ఒత్తిడి ఉంటుందా.. అంటే ఇటీవల జరిగిన ఓ ఘటన నిజమేనని చెబుతోంది. పని ఒత్తిడి కారణంగా ఓ రోబో ఆత్మహత్యకు పాల్పడిందని (Robot Commits Suicide) గత వారం నుంచి వార్తలు వస్తున్నాయి. రోబోలను ఎక్కువగా ఉపయోగించే దక్షిణ కొరియాలో ఈ ఘటన జరిగింది. అయితే అసలు ఏం జరిగింది.. పని ఒత్తిడితో రోబో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి... పూర్తి వివరాలు.

రోబోకు ఐడీ కార్డు కూడా ఉంది :
దక్షిణ కొరియాలో రోబోల వినియోగం ఎక్కువ. ప్రతి పదిమంది ఉద్యోగులకు సాయం చేసందుకు రోబోలను ఏర్పాటు చేస్తుంటారు. అలాగే గుమి సిటీ కౌన్సిల్‌ 2023 ఆగస్టు నుంచి ఓ రోబో సివిల్‌ సర్వెంట్‌గా విధుల్లో ఉంది. ఈ రోబో ఐడీ కార్డును కూడా కలిగి ఉంది. ఉద్యోగులకు ఫైల్స్‌ అందివ్వడంతోపాటు లిఫ్ట్‌ సహా ఇతర ప్రాంతాల్లో భద్రతా సూచనలు ఇస్తుంది.

robot committed suicide in south korea

ఆ రోజు రోబో విచిత్రంగా ప్రవర్తించింది :
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉంటుంది. అదే విధంగా జూన్ 26వ తేదీన ఈ రోబో సూపర్‌ వైజర్‌ విధుల్లో ఉంది. అయితే ఆరోజు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని అక్కడున్న ఉద్యోగులు తెలిపారు.

సాయంత్రం 4 గంటల సమయంలో రోబో నుంచి సరైన సంకేతాలు రాలేదని ఉద్యోగాలు చెప్పారు. రోబో కోసం వెళ్లి పరిశీలించగా.. ఆఫీస్‌ మొదటి, రెండో అంతస్తుల మధ్య ఉన్న మెట్ల వద్ద ముక్కలుగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు అక్కడున్న ఉద్యోగులు తెలిపారు.

robot committed suicide in south korea

పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంది..? :
దీనిపై దర్యాప్తు చేయగా.. పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు చాలా సమయం అదే ప్రాంతంలో రోబో తిరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ రోబోను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బేర్‌ రోబోటిక్స్‌ అనే సంస్థ తయారు చేసింది.

గుమి సిటీ కౌన్సిల్‌ కీలక ప్రకటన :
అయితే రోబో ఆత్మహత్య ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ ఘటన అనంతరం గుమి సిటీ కౌన్సిల్‌ ఓ ప్రకటన చేసింది. మరో రోబోను పనిలో పెట్టుకోబోమని వెల్లడించింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
robot committed suicide in south korea due to work pressure
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X