రోబోట్లతో నడిచే రెస్టారెంట్ ఇప్పుడు బెంగళూరులో

|

ప్రపంచం మొత్తం ఇప్పుడు స్మార్ట్ రంగం మీద ఆధారపడి పనిచేస్తోంది.అన్ని రంగాలలోను ఇప్పుడు వున్న దాని కంటే ఇంకా కొత్తగా ఎదో ఒకటి చేయాలి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.అలాంటి ఆలోచనలలో భాగంగా చైనా,జపాన్,అమెరికా వంటి అగ్ర దేశాలు రెస్టారెంట్‌లలో రోబోట్లను వినియోగిస్తున్నారు. కస్టమర్లకు కావలసిన ఆర్డర్లను తీసుకోవడం నుంచి వారికి సర్వ్ చేయడం మరియు వారికి ప్రత్యేక సందర్భాలలో వారికి శుభాకాంక్షలు తెలపడం వంటివి కూడా చేస్తాయి.

 
రోబోట్లతో నడిచే రెస్టారెంట్ ఇప్పుడు బెంగళూరులో

ఇప్పుడు అటువంటి రెస్టారెంట్‌లు బెంగళూరులో కూడా ప్రారంభమయ్యాయి. ఇండియాలో ముందుగా చెన్నై,కోయంబత్తూర్, ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాలలో ఇప్పటికే ఇటువంటి రెస్టారెంట్‌లు ప్రారంభించాయి. బెంగళూరులోని ఇందిరా నగర్ ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రోబోట్లు ఆహారాన్ని అందిస్తాయి:

రోబోట్లు ఆహారాన్ని అందిస్తాయి:

'రోబోట్ రెస్టారెంట్' అనే పేరుతో బెంగళూరులో మొట్టమొదటి రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ రోబోల ద్వారా ఆహారాన్ని సర్వ్ చేయడం జరుగుతుంది.

అద్భుతమైన విజయం:

అద్భుతమైన విజయం:

చెన్నై మరియు కోయంబత్తూర్లలో 'అద్భుతమైన విజయం' సాధించిన తరువాత బెంగళూరులో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు రెస్టారెంట్ యాజమాన్యం పేర్కొంది.

లొకేషన్ మరియు వసతి:

లొకేషన్ మరియు వసతి:

ఈ రెస్టారెంట్ బెంగళూరులోని ఇందిరా నగర్ ఏరియా ప్రాంతంలోని హై స్ట్రీట్ యొక్క 100 ఫీట్ రోడ్ లో ఉంది. ఇక్కడ 50 డైనింగ్ సెట్లతో వసతి కల్పిస్తుంది.

మెనూ:
 

మెనూ:

ఈ రెస్టారెంట్‌లో మెనూ ఎక్కువగా ఇండో-ఆసియా వంటకాలను కలిగి ఉంటుంది.అంతేకాకుండా అన్యదేశ మోక్‌టైల్ మెనూను కూడా కలిగి ఉంటుంది.

6 రోబోట్ల బృందం:

6 రోబోట్ల బృందం:

ఈ రెస్టారెంట్‌లో 6 రోబోట్ల బృందం ఉంటుంది (ఒక అషర్ మరియు 5 బేరర్లు). ప్రతి టేబుల్‌ మీద ఒక టాబ్లెట్ అమర్చబడి ఉంటుంది. దాని నుండి కస్టమర్లు తమ ఆర్డర్‌ను ఇవ్వవచ్చు లేదా రోబోట్‌లను పిలిచి కూడా తమ ఆర్డర్‌ను ఇవ్వవచ్చు. ఇక్కడ ఫుడ్ సర్వీస్ అంతా రోబోలచే చేయబడుతుంది.

రోబోట్లతో ఇంటరాక్టివ్ అవ్వడం:

రోబోట్లతో ఇంటరాక్టివ్ అవ్వడం:

ఇక్కడ రోబోట్ల ద్వారా ఇంటరాక్టివ్ అయి తమ ప్రత్యేక సందర్భాలలో అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడానికి ప్రత్యేకమైన పాటల ద్వారా పాడటానికి ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి.

రోబోట్ల సమర్ధత:

రోబోట్ల సమర్ధత:

రోబోట్లు సమర్ధవంతంగా పనిచేయడానికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి మరియు కార్యకలాపాల సమయంలో తలెత్తే ఏవైనా సమస్యలకు హాజరుకావడానికి సిబ్బంది కూడా తయారీదారుల నుండి శిక్షణ పొందారు.

బెంగళూరులో ఇప్పటికే అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరులోని ప్రజలు రోబోల రెస్టారెంట్‌ను బహు అద్భుతంగా స్వాగతిస్తారని మాకు నమ్మకం ఉంది. రోబోట్ రెస్టారెంట్లలో బెంగళూరు మాకు ఒక కలగా ఉంది మరియు మా కల నెరవేరడం జట్టుకు సంతోషకరమైన మరియు గర్వకారణమైన రోజు అని రోబోట్ రెస్టారెంట్ వ్యవస్థాపకుడు వెంకటేష్ రాజేంద్రన్ అన్నారు.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Robot Restaurant Likely To Open In Bengaluru: Know The Details Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X