ఆత్మహత్య చేసుకున్న రోబోట్!!

Posted By:

ఇంటి పనులతో విసిగివేసారిన ఓ క్లీనింగ్ రోబోట్ తనని తాను కాల్చుకున్న ఘటన వెబ్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. వివరాల్లోకి వెళితే... ఆస్ట్రియాకు చెందిన ‘ఐరోబోట్ రూంబా 760' (క్లీనింగ్ రోబోట్) మండుతున్న కిచెట్ హాట్ ప్లేట్ పై కూర్చొని తనని తాను దహించువేసుకుంది. తాము ఘటనా స్థలానికి చేరుకునే పాటికి కిచెట్ హాట్ ప్లేట్ పై రోబోట్ పూర్తిగా దగ్థమైందని స్థానిక అగ్నిమాపక సిబ్బందిలో ఒకరైన హెల్మట్ క్నైవాసిర్ తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న రోబోట్!!

ఎప్పటిలాగానే తమ ఇంట్లోని చిన్ని రోబోట్‌కు శుభ్రం చేసే పనిని పురమాయించిన ఆ కుటంబం ఇతర పనుల నిమిత్తం బయటుకు వెళ్లింది. వాస్తవానికి రోబోట్, తనకు పురమాయించిన పని పూర్తి అయిన వెంటనే   వంటగదిలో ఓ మూలన నిర్థేశించిన స్థలంలోకి వెళ్లి కూర్చోవల్సి ఉంది. అయితే, ఇందుకు విరుద్దంగా రోబోట్ రీయాక్టివేట్ అయి మండుతున్న కిచెన్ ప్లేట్ పై కూర్చొని బూడిదలా మారింది. తిరిగి ఇంటికి చేరుకున్న యజమని కుటుంబం ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన కారణాలను వెతికే ప్రయత్నంలో నిపుణులు నిమగ్నమయ్యారు. కాగా, రోబోట్ దగ్థమైన ఘటనలో తమ ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు ఇంటి యజమాని గెర్నాట్ హాకల్ (44) తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting