పాలు, కిరాణా వస్తువుల హోమ్ డెలివరీల కోసం రోబోలు!! ఎక్కడో తెలుసా??

|

టెక్నాలజీ పెరిగే కొద్ది వినూత్న పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. పైగా ప్రస్తుత కరోనా సమయంలో చాలా మంది ఇంటి నుండి బయటకు పోవడానికి ఇష్టపడటం లేదు. ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ మీద ఆధారపడుతున్నారు. సింగపూర్ లో హోమ్ డెలివరీల కోసం డిమాండ్ పెరుగుతున్న సందర్బంగా ప్రముఖ సింగపూర్ టెక్నాలజీ సంస్థ నగరంలోని ఒక ప్రాంతంలో నివసించే వారికి కిరాణా వస్తువులను అందించడం కోసం ఒక జత రోబోట్లను ఉపయోగిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

OTSAW
 

OTSAW డిజిటల్ సంస్థ అభివృద్ధి చేసిన "కామెల్లో" రోబోను ఉపయోగించి ఒక సంవత్సరం ట్రయల్ లో భాగంగా సింగపూర్ ప్రాంతంలోని 700 గృహాలకు హోమ్ డెలివరీలను అందించడం కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. వినియోగదారులు తమకు కావలసిన పాలు మరియు గుడ్లను డెలివరీ స్లాట్‌లలో బుక్ చేసుకోవచ్చు. రోబోట్ పిక్-అప్ పాయింట్‌కు అపార్ట్మెంట్ భవనం యొక్క లాబీకి చేరుకోబోతున్న సమయంలో ఒక యాప్ వినియోగదారులకు తెలియజేస్తుంది.

రోబోట్ 3D సెన్సార్లు

హోమ్ డెలివరీల కోసం ఉపయోగించే ఈ రోబోట్ 3D సెన్సార్లు, ఒక కెమెరా మరియు లగేజీ కోసం రెండు కంపార్ట్‌మెంట్లను కలిగ ఉంటుంది. ఈ రోబోలు ఒక్కొక్కటి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వాటిలో ఒక సారి 20 కిలోల (44 LB) వరకు తీసుకువెళ్ళగలవు. ఇవి సాధారణ వారపు రోజులలో రోజుకు నాలుగు లేదా ఐదు డెలివరీలను చేస్తాయి. ప్రతి ట్రిప్ తర్వాత ఈ రోబోలు తమను తాము క్రిమిసంహారకం చేయడానికి అతినీలలోహిత కాంతిని ఉపయోగిస్తాయని OTSAW డిజిటల్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ లింగ్ టింగ్ మింగ్ అన్నారు.

కాంటాక్ట్‌లెస్

కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరూ కాంటాక్ట్‌లెస్, హ్యూన్‌లెస్ వైపు చూస్తున్నారు అని OTSAW డిజిటల్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయిటర్స్‌తో తెలిపారు. ప్రస్తుతానికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు సిబ్బంది తమ రౌండ్లలో రోబోలతో పాటు వెళతారు.

రోబోట్ హోమ్ డెలివరీ సేవ
 

ఈ రోబోట్ హోమ్ డెలివరీ సేవను ప్రయత్నించిన 25 ఏళ్ల తాష్ఫిక్ హైదర్ మాట్లాడుతూ ఇది వృద్ధులకు చాలా సహాయకారిగా ఉంటుంది. దీని ద్వారా వారు తమకు కావలసిన వస్తువులను ఇంటి బయటకు వెళ్లకుండా సురక్షితంగా పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ మరొకరు ఈ కొత్త టెక్నాలజీ కొంతమందికి చాలా ఇబ్బంది కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. యువకులు దీన్ని అధికంగా ఇష్టపడతారు. కానీ పాత తరం వారు వీటిని ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఇవి యువకులు ఇష్టపడే గాడ్జెట్లు అని 36 ఏళ్ల గృహిణి జు యా యా జిన్ అన్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Robots Using For Groceries Home Delivery in Singapore

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X