రూ.59 నిమిషాల్లో కోటి రూపాయల లోన్ ? సింపుల్ డాక్యుమెంట్స్

By Gizbot Bureau
|

మీకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయా? రుణం కోసం చూస్తున్నారా? అయితే కేంద్రం మీకు శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం కేవలం 59 నిమిషాల్లోనే రుణాలు జారీ చేస్తోంది. ఎస్‌బీలోన్స్ఇన్59మినిట్స్.కామ్ పోర్టల్ ద్వారా 2019 మార్చి 31 దాకా ఏకంగా 27,893 మందికి రుణాలు అందించింది. చిన్న స్థూల మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు.

Rs 1 crore loan in 59 minutes for MSMEs: 10 easy steps

లోక్ సభలో ఒక ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు. 'మార్చి నెల చివరి వరకు 50,706 ప్రతిపాదనలకు సూత్రప్రాయ ఆమోదం లభించింది. 27,893 ప్రతిపాదనలకు డబ్బులు మంజూరు చేశామని వివరించారు. ఇదిలా ఉంటే మోడీ ప్రభుత్వం psbloansin59minutes.com పోర్టల్‌ను గతేడాదే ఆవిష్కరించింది. ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన కొద్ది నిమిషాల్లోనే ఇది దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. ఏకంగా రూ.35,000 కోట్లకు పైగా రుణాలు దీని ద్వారా మంజూరు అయ్యాయి.

గత నవంబర్‌లో

గత నవంబర్‌లో

చిన్న స్థూల మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) కోటి రూపాయల వరకు రుణ మంజూరీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గత నవంబర్‌లో ఈ పోర్టల్ ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఇప్పుడు రూ.5 కోట్ల వరకు రుణాలు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వపు పోర్టల్ ద్వారా లోన్ ప్రాసెసింగ్ సమయం 20-25 రోజుల నుంచి 59 నిమిషాలకు దిగొచ్చింది. సూత్రప్రాయ ఆమోదం పొందిన తర్వాత రుణం 7-8 రోజుల్లో మంజూరు అవుతుంది. ఐటీ రిటర్న్స్, జీఎస్టీ డేటా బ్యాంక్ స్టేట్‌మెంట్స్ లాంటివి నిమిషాల్లో విశ్లేషించి లోన్లు మంజూరు చేయడం ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత. ఆటోమేటెడ్ లోన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా కేవలం ఒక గంటలోపే, పారదర్శకంగా రుణాలు మంజూరు అవుతున్నాయని ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ రాజీవ్ కుమార్ రాజీవ్ కుమార్ చెబుతున్నారు.

 వేగవంతం

వేగవంతం

అంతే కాదు బ్యాంకులు, పన్నుల అధికారులు తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టించే అవకాశం కూడా లేదని రాజీవ్ కుమార్ చెబుతున్నారు. ఇప్పటి వరకు 1.62 లక్షల చిన్నతరహా యూనిట్లకు ఆమోద ముద్ర వేసి 1.12 లక్షల యూనిట్లకు రుణాలు మంజూరు చేశారు. మూడేళ్లలో రూ.6,500 కోట్ల రుణాలు ఇచ్చిన రెండు అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే ఈ పోర్టల్ ద్వారా లోన్ల మంజూరు చాలా వేగంగా ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ క్రెడిట్ స్యూస్ అభిప్రాయపడయం విశేషం. ఈ పోర్టల్‌లో సగటున రూ.27 లక్షల లోన్ మంజూరు చేయగా, రెండోసారి లోన్ తీసుకున్న వారి సగటు రూ.34 లక్షలు.

లోన్ వివరాలు

లోన్ వివరాలు

10 లక్షల నుంచి కోటిరూపాయల వరకు లోన్ అర్హతను బట్టి ఇస్తారు. వడ్డీ రేటు 8 శాతంగా ఉంటుంది.లోన్ ప్రాసెస్ పూర్తి అయిన వారం రోజుల్లో మీ అకౌంటుకుకి అమౌంట్ బదిలీ అవుతుంది.బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పించాలి. 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ పీడీఎఫ్ రూపంలో ఇవ్వాలి

ఈకెవైసి డిజిటల్ పేపర్ సబ్ మిట్ చేయాలి

ఈకెవైసి డిజిటల్ పేపర్ సబ్ మిట్ చేయాలి

గత మూడు సంవత్సరాల ఆదాయప పన్ను వివరాలను XML formatలో సమర్పించాలి. Income tax codes, e-filing details వివరాలు కూడా ఇవ్వాలి. GST ID username and password వంటి వివరాలను కూడా సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ అండ్ అప్రూవల్ ప్రాసెస్

రిజిస్ట్రేషన్ అండ్ అప్రూవల్ ప్రాసెస్

ముందుగా కంపెనీ అఫిషియల్ వెబ్ సైట్ PSBloansin59minutes.comలోకి వెళ్లండి. అందులో సిగ్నప్ లేక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి. మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఇస్తే ఒటీపీ వస్తుంది.

ఓటీపి వచ్చిన తరువాత దాన్ని ఎంటర్ చేసి ఐ అగ్రి బటన్ నొక్కగానే మీకు ప్రొసీడ్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. అక్కడ కనిపించే ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

తరువాత జీఎస్టీ వివరాలను అడుగుతుంది. అవి ఎంటర్ చేయాలి. దాని తర్వాత బ్యాంకు వివరాలను ఎంటర్ చేయాలి. అది అయిపోగానే మీకు లోన్ ఎందుకు అవసరమో దానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయండి.

 

 బ్యాంకు వివరాలు

బ్యాంకు వివరాలు

ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీకు అక్కడ కనిపించే బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న బ్యాంకును సెలక్ట్ చేసుకోండి

ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీరు Convenience fee కింద రూ.1000 చెల్లించాలి.

ఇది పే చేసిన తరువాత మీ ప్రాసెస్ పూర్తి అయిపోతంది. మీరు అప్రూవ్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వారం రోజుల్లో మీ అకౌంట్లో లోన్ అమౌంట్ జమ అవుతుంది.

 

Best Mobiles in India

English summary
Rs 1 crore loan in 59 minutes for MSMEs: 10 easy steps on this website

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X