5 రోజుల్లో 15 వేల కోట్ల బిజినెస్ చేసిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్
దసరా-దీపావళి పండుగ సీజన్ ను ఈ-కామర్స్ సైట్లు ఘనంగా ప్రారంభించాయి. దిగ్గజ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ 5 రోజుల్లోనే రూ.15 వేల కోట్ల బిజినెస్ చేసాయి.
దసరా-దీపావళి పండుగ సీజన్ ను ఈ-కామర్స్ సైట్లు ఘనంగా ప్రారంభించాయి. దిగ్గజ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ 5 రోజుల్లోనే రూ.15 వేల కోట్ల బిజినెస్ చేసాయి. ఈ విషయాన్ని రెడ్‌సీర్ కన్సల్టింగ్ సంస్థ వెల్లడించింది. 2017లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రూ.10,325 కోట్ల బిజినెస్ చేశాయి. ఈసారి అది 64 శాతం పెరిగింది. టైర్ టూ సిటీస్ నుంచి బిజినెస్ పెరగడంతో ఈసారి భారీ మొత్తం వచ్చినట్లు రెడ్‌సీర్ చెప్పింది.

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్...
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ అయితే తొలి 36 గంటల్లోనే గతేడాది మొత్తం సేల్స్‌ను అందుకోవడం విశేషం. ఈ ఏడాది కొత్తగా చిన్న చిన్న టౌన్ల నుంచి 80 శాతం కొత్త కస్టమర్లు వచ్చినట్లు అమెజాన్ వెల్లడించింది. ఇక విలువ పరంగా స్మార్ట్‌ఫోన్లు, సంఖ్య పరంగా ఫ్యాషన్ ఐటమ్స్ ఎక్కువగా అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ చెప్పింది.

అమెజాన్ హిందీ వెబ్‌సైట్....
ఇక కొత్తగా అమెజాన్ హిందీ వెబ్‌సైట్‌ను లాంచ్ చేయగా.. అందులోనూ సాధారణ రోజులతో పోలిస్తే సేల్ రోజుల్లో కస్టమర్ల సంఖ్య 2.4 రెట్లు ఎక్కువగా వచ్చింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్....
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ గతంలోని అన్ని రికార్డులను తిరగ రాసిందని ఆ సంస్థ వెల్లడించింది. మొత్తం దేశంలోని ఈ-కామర్స్ బిజినెస్‌లో 70 శాతం ఫ్లిప్‌కార్ట్‌లోనే జరిగినట్లు తెలిపింది.

కేటగిరీ వారీగా చూస్తే ....
ఇక కేటగిరీ వారీగా చూస్తే ఫ్యాషన్ మార్కెట్‌లో 85 శాతం, భారీ హోమ్ అప్లయెన్సెస్‌లో 75 శాతం, ప్రతి నాలుగు స్మార్ట్‌ఫోన్లలో మూడు ఫ్లిప్‌కార్ట్‌లోనే అమ్ముడైనట్లు ఆ సంస్థ చెప్పింది. కొత్త కస్టమర్ల సంఖ్య 50 శాతం పెరిగినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. సేల్ రోజుల్లో ఒక రోజు 2.5 కోట్ల మంది తమ సైట్‌లో ఉన్నట్లు చెప్పారు.

పేటీఎం మాల్....
పేటీఎం మాల్‌లో 1.2 కోట్ల వస్తువులు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది.సాధారణ రోజుతో పోలిస్తే లావాదేవీలు 5 రేట్లు పెరిగాయని దాదాపు 6 కోట్ల మంది తమ ప్లాట్ ఫామ్ ను సందర్శించినట్టు పేటీఎం సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications








