అమెజాన్ అధినేత విడాకుల ఖరీదు తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం
పాతికేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్య మెకాంజీ నుంచి విడాకులు తీసుకుంటున్నానంటూ అమెజాన్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ఈ వారం షాకింగ్ న్యూస్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
పాతికేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్య మెకాంజీ నుంచి విడాకులు తీసుకుంటున్నానంటూ అమెజాన్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ఈ వారం షాకింగ్ న్యూస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విడాకులకు కారణం అతను ప్రముఖ టీవీ యాంకర్‌తో ప్రేమలో పడటమే అనే వార్తలు కూడా షికార్లు చేస్తున్నాయి. కాగా ప్రపంచలోనే అత్యంత ధనవంతుడైన బెజోస్ ప్రస్తుత సంపాదన 137 బిలియన్ డాలర్లని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా విడాకుల తర్వాత భరణం రూపంలో ఆయన తన భార్యకు సుమారు 60-70 బిలియన్ డాలర్లు ( దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు) చెల్లించనున్నారట. ఈ భరణం పొందిన తరువాత ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా మెకాంజీ నిలవనున్నారట. కాగా బెజోస్ సంపద సగానికి సగం పడిపోనుంది.

స్నేహితులుగా కొనసాగుతాం
ఇదిలా ఉంటే పాతికేళ్లపాటు భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్ తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని సంయుక్త ప్రకనటలో తెలిపారు.

ఫస్ట్ లవ్
రచయిత్రి అయిన మెకెంజీ (48) 1993లో న్యూయార్క్‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో తొలిసారిగా బెజోస్‌ను కలుసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరునెలల తరువాత అదే ఏడాది ఒక్కటయ్యారు. ఇప్పుడు ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు.

మొదటి బెస్ట్ రీడర్ తన భర్తే
మెకెంజీ రెండు నవలలు కూడా రాశారు. తన రచనలకు, మొదటి బెస్ట్ రీడర్ తన భర్తే నని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. రచనా వ్యాసంగంతోపాటు మెకంజీ బైస్టాండర్ రివల్యూషన్ (వేధింపులకు వ్యతిరేకంగా) అనే సంస్థను 2014లో ఏర్పాటు చేశారు.

అమెజాన్ ప్రస్థానం
1994లో ఆన్‌లైన్ బుక్సెల్లర్‌గా ఏర్పాటైన అమెజాన్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అమెజాన్ సంస్థను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మెకంజీ తన బిజినెస్‌కు ఎంతో సహకారం అందించారని పలు సందర్భాల్లో జెఫ్ బిజోస్ గుర్తు చేసుకున్నారు.కాగా ఇటీవలే అమెజాన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు ఖరీదైన విడాకులు ఇవే
దిమిత్రి రైబోలోలెవ్- ఎలీనా రైబోలోలెవ్
భార్య నుంచి విడిపోతూ బిలియనీర్ దిమిత్రి తన భార్య ఎలీనాకు 4.5 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించారు. ఇది 2001లో జరిగింది.

ఎలిక్ వైల్డిస్టీన్- జోక్లిన్ వైల్డిస్టీన్
ఫ్రెంచ్‌లో జన్మించిన అమెరికన్ వ్యాపారవేత్త ఎలిక్ 1999లో తన భార్యకు విడాకుల తర్వాత 3.8 బిలియన్ డాలర్లు భరణం రూపంలో చెల్లించారు.

రూపెర్ట్ మర్దోక్- అన్నా మర్దోక్ మన్
అమెరికన్ మీడియా మెఘల్ రూపెర్ట్ 31 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 1999లో తన భార్య అన్నా నుంచి విడిపోతూ ఆమెకు 2.6 బిలియన్ డాలర్లు భరణంగా ఇచ్చారు.

బెర్నీ ఎలెస్టోన్- స్లావికా ఎలెస్టోన్
ప్రపంచంలోనే ఖరీదైన విడాకులు పొందిన ఐదో జంటగా బెర్నీ-స్లావికా జంట నిలిచింది. 2009లో విడిపోయిన ఈ జంట విడాకుల ఖరీదు- 1.2 బిలియన్ డాలర్లు.

స్టీవ్ వీన్- ఎలైన్ వీన్
కాసినో మొఘల్ స్టీవ్ వీన్ తన భార్య నుంచి విడిపోయే క్రమంలో సుమారు 1 బిలియన్ డాలర్ల భరణం చెల్లించారు. కాగా ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు స్టీవ్ వీన్‌పై రావడంతో ఆయన భార్య విడాకులు కోరినట్లుగా అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి.

స్టీవెన్ స్పీల్‌బర్గ్- ఎమీ ఇర్వింగ్
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ 1989లో తన భార్య ఎమీ నుంచి విడిపోతూ భరణంగా 100 మిలియన్ డాలర్లు ఎమీకి చెల్లించారు.


Click it and Unblock the Notifications








