ఎస్ఎంఎస్ చేస్తే రూ.500ల ఫైన్!

Posted By: Staff

ఎస్ఎంఎస్ చేస్తే రూ.500ల ఫైన్!

న్యూఢిల్లీ: టెలీ మార్కెటింగ్‌లో భాగంగా నిరంతరం ఫోన్‌లు, సందేశాలతో విసిగించే రిజిస్టర్ కాని మార్కెటర్ల ఆగడాలకు టెలికాం రెగులేటరీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ట్రాయ్ అడ్డుకట్టు వేయునుంది. ట్రాయ్ కొత్త ప్రతిపాదనల ప్రకారం రిజిస్టర్ కాని టెలిమార్కెటర్ల నుంచి విసిగించే ఎస్ఎంఎస్‌లు తరచూ వస్తుంటే మొదటి సారి ఫిర్యాదు కింద సదురు మార్కెటర్‌కు రూ.500 జరిమానా విధిస్తారు. మరో సారి ఇలా విసిగించినట్లు ఫిర్యాదు అందితే సదరు మార్కెటర్ నెంబరును డిస్కన్కెట్ చేయటం జరగుతుందని ప్రతిపాదనల్లో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

టెలికం కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌ కస్టమర్‌ ప్రీపరెన్స్‌ (పదవ చట్టం) సవరణ 2012లో మార్పులు చేర్పుల ముసాయిదా తయారు చేసింది. ముసాయిదా ప్రకారం ఆపరేటర్లు కేవలం తమ వద్ద రిజిష్టను చేసుకున్న టెలిమార్కెటర్ల ద్వారానే తమ ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే వినియోగదారులు సిమ్‌ కొనుగోలు చేసేటప్పుడు దాన్ని టెలిమార్కెటింగ్‌కు వినియోగించమని టెలికం ఆపరేటర్‌కు నిబంధనలకు కట్టుబడి ఉంటామని హామీ తీసుకోవాలని ట్రాయ్ సూచించినట్లు సమాచారం. వినియో గదారులకు విసిగించే ఎస్‌ఎంఎస్‌లు వస్తే వారు 1909 నెంబరుకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చునని తెలిపింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting