పైసా కట్టకుండానే మొబైల్ సొంతం చేసుకోండి
పెద్ద నోట్ల రద్దుతో జీరో డౌన్పేమెంట్ ఆఫర్లు మొదలు, ఎలాంటి ముందస్తు చెల్లింపు లేకుండా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే ఆవకాశం
పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మొబైల్ మార్కెట్ ని తాకింది. తమ దగ్గర ఉన్న కొద్ది సొమ్ము వ్యక్తిగత అవసరాలకే సరిపోతుండటంతో మొబైల్ మార్కెట్ వైపు చూసేవారే కరువయ్యారు. దదీంతో మొబైల్ వ్యాపారులు ఒక్కసారిగా పడిపోయిన అమ్మకాలు చూసి షాక్ తిన్నారు. ఎలాగైనా అమ్మకాలను పెంచుకోవాలని వినియోగదారులను ఆకర్షించుకోవాలని సరికొత్త ప్లాన్లకు తెరలేపారు. ఫోన్లు ఎటువంటి చెల్లింపులు లేకుండానే మీకందిస్తున్నారు. ఎలాగో మీరే చూడండి.

జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లు
పెద్ద నోట్ల రద్దుతో మొబైల్ వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించేందుకు జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లు మొదలు పెట్టారు. ఈ ఆఫర్తో వారం రోజులగా ఏటీఎంల వద్ద దర్శనమిస్తున్న క్యూ లైన్లు ఇప్పుడు మొబైల్ షాపుల వద్ద కూడా కనిపిస్తున్నాయి.

ఎలాంటి ముందస్తు చెల్లింపు లేకుండా మొబైల్ ఫోన్
సంగీతాలో శనివారం సాయంత్రం నుంచి ఎలాంటి ముందస్తు చెల్లింపు లేకుండా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే ఆఫర్ ను ప్రారంభించారు. తర్వాత 12 నెలల పాటు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించవచ్చుని సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర చెబుతున్నారు.

మిగతా మొత్తాన్ని వడ్డీతో సహా విడతల వారీ
సాధారణంగా అయితే ఫోన్ ధరలో కొంత భాగం చెల్లించిన తరువాత మిగతా మొత్తాన్ని వడ్డీతో సహా విడతల వారీ చెల్లించాల్సి ఉంటుంది. కాని ఇప్పుడు మీరు ఏమి చెల్లించకుండానే నచ్చిన ఫోన్ తీసుకోవచ్చని మిగతా మొత్తం వాయిదాల్లో చెల్లించాలని చెబుతున్నారు.

అమ్మకాలు తగ్గటంతో
మాములుగా అయితే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నగదు రూపంలో చెల్లింపులు స్వీకరిస్తారు. అయితే రూ .500, రూ .1000 నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు తగ్గటంతో ముందస్తు చెల్లింపులు లేకుండా రిటైలర్లు ఫోన్ల అమ్మకాలు చేపట్టారు.

అమ్మకాలు భారీగా
తాజా ఆఫర్తో అమ్మకాలు భారీగా ఊపందుకున్నాయనీ ... ఫోన్లు మొదలు పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారని సంగీత మొబైల్స్ చెబుతోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో 300 పైగా మొబైల్ స్టోర్లు
ప్రస్తుతం సంగీత మొబైల్స్‌కు దక్షిణాది రాష్ట్రాల్లో 300 పైగా మొబైల్ స్టోర్లు ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications