అందరూ చేస్తున్నారని... తను కూడా?

Posted By: Prashanth

అందరూ చేస్తున్నారని... తను కూడా?

 

సామ్‌సంగ్, హెచ్‌టీసీ, సోనీ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు పరిశ్రమలో తమ సత్తాను చాటుతున్న నేపధ్యంలో యూజర్ ఫ్రెండ్లీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్‌జీ తన ప్రత్యేకతను చాటుకునే క్రమంలో ఉత్తమ క్వాలిటీ కెమెరాతో కూడిన క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ ఫోన్ విడిభాగాలను ఎల్‌జీ అనుబంధ సంస్థలైన ఎల్‌జీ ఇన్ఫోటెక్, ఎల్‌జీ చెమ్, ఎల్‌జీ డిస్‌ప్లేలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో కూడిన 10 మెగా పిక్సల్ కెమెరాతో పాటు శక్తివంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసినట్లు అంచనా.

ఎల్‌జీ తొలి క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్ ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డి ఫీచర్లు:

డిస్‌ప్లే 4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్ , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, యూఎల్‌పీ జీఫోర్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎన్-విడియా టెగ్రా3 చిప్‌సెట్, ఫ్రంట్ కెమెరా 1.3మెగా పిక్సల్, రేర్ కెమెరా 8 మెగాపిక్సల్, వీడియో రికార్డింగ్, జియో ట్యాగింగ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి, 1జీబి ర్యామ్, ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్, బ్రౌజర్( ఆడోబ్ ప్లాష్, హెచ్‌టిఎమ్ఎల్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, 2140ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర అంచనా రూ.20,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot